S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/19/2018 - 06:09

న్యూఢిల్లీ: కేరళను ముంచెత్తుతున్న వరదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ ప్రకృతి విపత్తుల నియంత్రణ కమిటీ (ఎన్‌సీఎంఆర్‌సీ)ని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి కేరళ సబ్‌కమిటీతో సమన్వయంగా పనిచేయాలని కోర్టు సూచించింది.

08/18/2018 - 01:21

హుస్నాబాద్, ఆగస్టు 17: తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన 47గొర్రెలను శుక్రవారం హుస్నాబాద్ వారసంతలో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రెండులక్షల 40వేల ఉంటుందని అధికారుల తెలిపారు. మల్లంపెల్లి పశువైద్యాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్‌ఐ సుధాకర్ సంతలో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను విచారించగా సబ్సిడీ గొర్రెలని తెలసింది.

08/18/2018 - 01:20

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 17: పెద్దపల్లి మున్సిపాల్టీలో చందపల్లి గ్రామం విలీనంపై హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగర పంచాయ తీగా ఉన్న పెద్దపల్లిని మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు చుట్టు పక్కల ఉన్న రంగంపల్లి, చందపల్లి, బంధంపల్లి గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గతం లో ఉత్తర్వులు జారీ చేసింది.

08/18/2018 - 00:53

హైదరాబాద్, ఆగస్టు 17: జీహెచ్‌ఎంసీ ప్రైవేట్, ఔట్‌సోర్స్ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలు, మెరుగైన పాలన అంటూ ప్రవేశపెట్టిన సంస్కరణలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్స్ డ్రైవర్‌గా పనిచేసిన ఓ ఉద్యోగి సెలవు రోజైన శుక్రవారం కమిషనర్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా, అధికారుల్లో సంచలనాన్ని రేకెత్తించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

08/18/2018 - 00:52

రాజేంద్రనగర్, ఆగస్టు 17: రాజేంద్రనగర్ పరిధిలో ముగ్గురు దుండగులు భార్యాభర్తలపై దాడి చేసి విలువైన బంగారు ఆభరణాలు.. నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

08/18/2018 - 00:42

కృత్తివెన్ను, ఆగస్టు 17: మండల పరిధిలోని చినగొల్లపాలెం పంచాయతీలోని రామాపురం గ్రామానికి చెందిన విశ్వనాధ శివయ్య వేటకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం ఉదయం శివయ్య వేటకు వెళ్లాడు. వేటకు వెళ్లిన శివయ్య తిరిగి రాకపోవటంతో బంధువులు శుక్రవారం సముద్రంలో గాలించగా సముద్రపు పాయలో శవమై కనిపించాడు.

08/18/2018 - 01:24

సీలేరు: స్థానిక రిజర్వాయర్‌లో యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యం కావడంతో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై విభూషణరావు అందించిన వివరాలిలా ఉ న్నాయి. జీకేవీధి మండలం దారకొండకు చెందిన కంబాల వంశీ(19) విశాఖపట్నం కృష్ణాకాలేజీలో బీఎస్సీ మైక్రోబయోలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వంశీ సీలేరుకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

08/18/2018 - 00:13

దేవరపల్లి, ఆగస్టు 17: దేవరపల్లి మండలం యర్నగూడెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి వద్ద మండలంలోని కృష్ణంపాలెంకు చెందిన పౌల్ట్రీ రైతు దుగ్గిన సుబ్రహ్మణ్యం శుక్రవారం వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

08/18/2018 - 00:00

గుంటూరు, ఆగస్టు 17: జల్సాలు, దుర్వ్యసనాలకు బానిసలైన గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు కార్లు, మోటారు సైకిళ్లు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ గజదొంగలుగా మారారు. ఎట్టకేలకు నగరంపాలెం సిఐ శ్రీ్ధర్‌రెడ్డి, సీసీఎస్ సీఐలు రత్నస్వామి, ఆర్ సురేష్‌బాబుల నేతృత్వంలో నిందితులను అరెస్ట్‌చేశారు.

08/17/2018 - 23:49

నాయుడుపేట, ఆగస్టు 17: మండల పరిధిలోని గ్రీన్‌టెక్ కంపెనీలో ఇంటి దొంగలు నిజమేనని గతంలో మేనేజర్‌గా పనిచేసి మానేసిన వ్యక్తి, ప్రస్తుతం పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో కుమ్మక్కై భారీ చోరీకి పథకం వేశారని గూడూరు డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక సిఐ కార్యాలయంలో గ్రీన్‌టెక్ కర్మాగారంలో జరిగిన చోరీలపై విలేఖరులతో మాట్లాడారు.

Pages