S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/17/2018 - 01:51

కరీంనగర్ (లీగల్), ఫిబ్రవరి 15: పోలీస్ శాఖలో ఎఎస్‌ఐగా ఉద్యోగం చేస్తూ రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎఎస్‌ఐ బుజ్జనగారి వేణుగోపాల్ (56)కు కరీంనగర్ ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు గురువారం సంవత్సరం జైలుశిక్ష విధించారు.

02/17/2018 - 01:31

తిప్పర్తి, ఫిబ్రవరి 16: మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన యువ రైతు బొంత వీరయ్య(28) తనకున్న మూడెకరాలతో పాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు.

02/17/2018 - 00:27

నందికొట్కూరు/కర్నూలు, ఫిబ్రవరి 16:పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పఠాన్ హనీఫ్‌ఖాన్(50) వారం రోజుల క్రితం అదృశ్యం కాగా, శుక్రవారం కర్నూలు సమీపంలోని హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. వారం రోజుల క్రితం కర్నూలుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన పఠాన్‌ఖాన్ ఆ రోజు నుంచి కన్పించకుండాపోవడంతో అతడి కుటుంబీకులు ఈ నెల 11వ తేదీ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

02/17/2018 - 00:27

క్రిష్ణగిరి, ఫిబ్రవరి 16:మండల పరిధిలోని కంబాలపాడు గ్రామం వద్ద ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తూ పడి శ్రీనివాసులు(24) మృతి చెందాడని ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపారు. అనంతపురం నగరంలోని సోమనాథ్‌నగర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు అనంతయ్య బోర్‌వెల్స్ మిషన్‌లో వర్కర్‌గా పని చేస్తున్నాడు.

02/17/2018 - 00:08

పెదపూడి, ఫిబ్రవరి 16: అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియురాలిపై అనుమానంతో వివాహిత మహిళను ఆమె ప్రియుడే హత్య చేసి ఎవరికీ అనుమానం కలగకుండా కాలువ గట్టుపై పూడ్చివేసిన ఘటన మండలంలోని అచ్యుతాపురత్రయంలో జరిగింది. దీంతో గ్రామం ఉలిక్కిపడింది.

02/17/2018 - 00:05

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: జిల్లాలో నిర్వహించిన దాడుల్లో రూ. 18.14 లక్షల విలువైన 124.25 టన్నుల ఎరువులను సీజ్ చేయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలియజేశారు.

02/17/2018 - 00:02

వి.కోట, ఫిబ్రవరి 16: మండల కేంద్రమైన వి.కోటలో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి సభ్యురాలు శుక్రవారం హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వి.కోట 1 ఎంపిటిసి సభ్యురాలుగా భాగ్యలక్ష్మి(45) వైకాపా తరపున గెలుపొందింది. ఇటీవల పార్టీ మారి తెలుగుదేశం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సత్యసాయి నగర్‌లోని సరిత ఇంటిలో నివసిస్తున్నారు.

02/16/2018 - 23:59

మదనపల్లె, ఫిబ్రవరి 16: మదనపల్లె మున్సిపల్ ఉద్యోగి సుధాకర్‌ను సస్పెండ్ చేస్తు శుక్రవారం కమీషనర్ భవానిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. తాను ఏతప్పు చేయకుండానే సస్పెన్షన్ ఎందుకు చేశారంటూ సుధాకర్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మున్సిపల్ మేనేజర్ ఫిర్యాదుతో వన్‌టౌన్ ఎస్‌ఐ సుమన్ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

02/16/2018 - 23:48

శెట్టూరు, ఫిబ్రవరి 16 : మండల పరిధిలో శుక్రవారం యాటకల్లు గ్రామంలో గొల్ల శివ (20) శుక్రవారం ఇంట్లో దూలానికి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివకు ఈమధ్యనే తల్లిదండ్రులు చనిపోయారు. ఈనేపథ్యంలో తనకు ఎవరూ దిక్కు లేరని విరక్తి చెంది ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

02/16/2018 - 23:47

బత్తలపల్లి, ఫిబ్రవరి 16: అనంతపురం- కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రాగవంపల్లి బస్టాపు సమీపంలో శుక్రవారం ఆటోను లారీని ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Pages