S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/14/2019 - 20:39

న్యూఢిల్లీ/బెంగళూరు, జూన్ 14: కర్నాటకలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పోంజీ సంస్థ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. వేలాదిమంది పెట్టుబడిదారులను మోసగించడంతోపాటు ఐఎంఏ జ్యువెల్స్‌తో సంబంధం ఉన్న బెంగళూరులో పోంజీ జోనల్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) అంటే ఎఫ్‌ఐఆర్‌తో సరిసమానమైన కేసును ఈడీ నమోదు చేసింది.

06/14/2019 - 20:39

లక్నో, జూన్ 8: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆజంఖాన్ ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ అభ్యర్థి జయప్రద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం కొట్టి వేసింది. ప్రాదేశిక పరిథి లేని కారణంగానే రిట్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తులు రంజన్‌రాయ్, ఎన్‌కే జౌహన్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

06/14/2019 - 04:37

తొర్రూరు, జూన్ 13: కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంతో జీవితంపై విరక్తిచెంది తన 13నెలల కుమారునికి ఉరేసి ఆపై తాను కూడా ఉరేసుకొని ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో చొటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

06/14/2019 - 04:03

న్యూఢిల్లీ, జూన్ 13: ఇటీవల నిర్వహించిన నీట్(యూజీ)-2019 పరీక్ష రాసిన నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. నీట్(యూజీ)-2019 పరీక్షలో అడిగిన అయిదు ప్రశ్నలకు ఆన్సర్ కీ తప్పుగా ఉందని, అందువల్ల ఆ పేపర్‌ను రద్దు చేయవలసిన అవసరం ఉందని అభ్యర్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

06/14/2019 - 02:06

విజయవాడ (క్రైం), జూన్ 13: వీటీపీఎస్‌లో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరికి ఏడాది పాటు జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన కత్తురాజు రామకృష్ణ అనే వ్యక్తి బంగారం పని చేస్తుంటాడు.

06/14/2019 - 02:05

మైలవరం, జూన్ 13: మైలవరంలో సంభవించిన అగ్నిప్రమాదంలో గ్యాస్ సిలెండర్ల లారీ దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండపల్లి నుంచి హెచ్‌పి గ్యాస్ సిలెండర్ల లోడుతో లారీ ఖమ్మం వెళ్ళి వాటిని అన్ లోడు చేసి తిరిగి వస్తుండగా, బుధవారం రాత్రి లారీ డ్రైవరు లారీని మైలవరంలో రోడ్డు పక్కన నిలిపివేశాడు.

06/13/2019 - 23:51

మేడ్చల్, జూన్ 13: మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ. 68 వేల నగదు, రూ. 35 వేల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

06/13/2019 - 23:51

శేరిలింగంపల్లి, జూన్ 13: భాగస్వామి వేధింపులతో హోమ్ ఫుడ్స్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో పార్ట్‌నర్ చేసిన కుట్రకు అతను బలయ్యాడు. చందానగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన టీవీ శ్రీనివాస రావు (47), స్నేహితుడు శ్రీనివాస్ బాబ్జీ..

06/13/2019 - 23:51

నేరేడ్‌మెట్, జూన్ 13: యువతిని ప్రేమించి మరొకరు పరిచయం కావడంతో అమె ఫోటోలు తీసుకుని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ రామాంతపూర్‌లో నివసించే కందేరి శ్రీ్ధర్ రావు(38) వ్యాపారీ. మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివసించే యువతి(31) ప్రైవేట్ ఉద్యోగి. 2013లో శ్రీ్ధర్‌తో పరిచయం ఏర్పడింది.

06/13/2019 - 23:50

జీడిమెట్ల, జూన్ 13: ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్లలో నవి రత్నా ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సంపత్ సురెందర్ రెడ్డి కుమారుడు అభినవ్ చంద్ర (15) నారాయణ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12న రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేడు.

Pages