S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/18/2019 - 23:47

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 18: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు సహా ఇద్దరు మావోలు హతమయ్యారు. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. రెండవ విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, రాజ్‌నందన్‌గామ్, మహాసముంద్ లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది.

04/18/2019 - 23:46

నగరి / మదనపల్లె /పెద్దారవీడు, ఏప్రిల్ 18: చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఒక యువతి మృతి చెందగా, మదనపల్లె మండలంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో తల్లీ బిడ్డ మృతి చెందారు.

04/19/2019 - 03:20

చౌటుప్పల్, ఏప్రిల్ 18: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద బుధవారం రాత్రి ప్రత్యేక పోలీసు బృందం జరిపిన తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల రూపాయల విలువ చేసే 11 క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్ డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ అధికారులు పక్కా సమాచారం మేరకు కాపుకాసి గంజాయిని పట్టుకున్నారు.

04/18/2019 - 23:09

నడిగూడెం, ఏప్రిల్ 18: పిడుగుపాటుతో కూలీ మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

04/18/2019 - 23:04

కొత్తకోట, ఏప్రిల్ 18: డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల కావేరి బస్సు బోల్తా పడిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కావేరి బస్సు మండల పరిధిలోని విలీయంకొండ సబ్‌స్టేషన్ సమీపంలో బస్సు బోల్తా పడింది.

04/18/2019 - 22:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ వారం రోజుల పాటు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీలోని ఒక కోర్టు గురువారం కొట్టివేసింది. కుటుంబంతో కలిసి ఈస్టర్ వేడుకలు జరుపుకోవడానికి తాత్కాలిక బెయిలు ఇవ్వాలని కోరుతూ క్రిస్టియన్ ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు.

04/18/2019 - 05:08

నడిగూడెం, ఏప్రిల్ 17: ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యం వారికి అందకుండా దళారులకు వరంగా మారి రిసైక్లింగ్ చేస్తూ సుమారు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన సంఘటనన బుధవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని వేణుగోపాలపురంలో చోటుచేసుకుంది.

04/18/2019 - 05:07

అమీన్‌పూర్, ఏప్రిల్ 17: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నడండ్రే తమ పాలిట కాలయముడవుతాడని ఆ చిన్నారులకు తెలియలేదు.. నిద్రలోనే తమ జీవితం తెల్లారిపోతుందని ఉహించలేదు. విచక్షణ కోల్పోయిన ఆ ఉన్మాది ఒక్క వేటులో పిల్లల్లో ఒకరిని కత్తితో పొడిచి చంపగా, మరొకరిని తాడుతో ఉరి బిగించి హత్య చేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్ పట్టణంలోని బాంబే కాలనీలో బుధవారం ఉదయం వెలుగు చూసింది.

04/18/2019 - 05:06

గణపురం, ఏప్రిల్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. ఇద్దరు వృద్ధులపై దాడి చేయగా జూకంటి సమ్మయ్య (85) అక్కడికక్కడే మృతి చెందగా మరో వృద్ధురాలు బోల్ల రాజమ్మ, గాయాలతో బయటపడింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. చెల్పూరు గ్రామానికి చెందిన జూకంటి సమ్మయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

04/18/2019 - 04:29

తిరుపతి, ఏప్రిల్ 17: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో వేగంగా వస్తున్న జీపు, మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో స్కూటరిస్టు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలో నివాసం ఉంటూ తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో బలరాం అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Pages