S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/17/2019 - 02:48

విజయవాడ (క్రైం), మే 16: దోపిడీ కేసులో ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి రెండేళ్లు జైలు, రూ.500ల జరిమానా విధిస్తూ 11వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.

05/17/2019 - 02:17

జీడిమెట్ల, మే 16: వ్యాపారానికి అడ్డువస్తున్నాడనే కక్ష్య అల్లుడిని రాడ్‌తో దాడి చేసి మామ హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాచుపల్లి గ్రామం శ్రీవాణి నగర్ జ్యోతి ప్లాంట్‌లో నివాసముండే ఎండీ జాకీర్ హుస్సేన్ (48) బాచుపల్లి నుంచి మియాపూర్ వెల్లే దారిలో సింఘిల్ టయర్స్ అండ్ మార్బుల్స్ ప్రక్కన పంచర్ దుకాణం నడుపుతుంటాడు. సెకండ్ హాండ్ టయర్స్‌ను కొనుగోలు చేస్తుంటాడు.

05/17/2019 - 02:15

జీడిమెట్ల, మే 16: వాహనాల చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.8 లక్షలు విలువ చేసే వాహనాలను జీడిమెట్ల పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. గురువారం జీడిమెట్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ ఏసీపీ గోవర్దన్, సీఐ రమణా రెడ్డి వెల్లడించారు. మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలానికి చెందిన ఆర్.సుధాకర్.. షాపూర్‌నగర్ రాజీవ్ గాంధీ నగర్‌లో అద్దెకు నివసిస్తున్నాడు.

05/17/2019 - 02:15

రాజేంద్రనగర్, మే 16: నగరానికి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

05/17/2019 - 01:47

హైదరాబాద్, మే 16: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల పిటీషన్లపై హైకోర్టులో గురువారం నాడు విచారణ కొనసాగింది.

05/17/2019 - 01:44

హైదరాబాద్: అనర్హత వేటుతో ఖాళీ అయిన మూడు శాసనమండలి స్థానాలకు జూన్ 3వ తేదీ వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డిల శాసనమండలి సభ్యత్వం రద్దు వ్యవహారంపై హైకోర్టులు గురువారం నాడు విచారణ జరిగింది.

05/16/2019 - 23:22

మార్కాపురం, మే 16: అసలే అంతంత మాత్రం ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబం అది. కుటుంబ పెద్దలు కూలీనాలీ చేస్తేనే ఇళ్లు గడిచేది. తాము ఇబ్బందులు పడినా కష్టనష్టాలకోర్చి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. ఇవేమి పట్టని కుటుంబ యజమాని పెద్దకుమారుడు తన పుట్టిన రోజు వేడుకలకు డబ్బులివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. తమ స్థోమతకు అనుగుణంగా నడుచుకోవాలని తల్లిదండ్రులు కుమారున్ని వారించారు.

05/16/2019 - 23:21

తర్లుపాడు, మే 16: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి అటవీప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని ముగ్గురు వేటగాళ్ళు అడవిలోనికి ప్రవేశించి వేసవి తాకిడికి దాహార్తిని తీర్చుకునేందుకు విడిపోయి ఒకరు మృతి చెందగా మరొకరు తప్పిపోగా, ఇంకొకరు జాతీయరహదారికి చేరుకొని జరిగిన సంఘటన పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

05/16/2019 - 22:58

న్యూఢిల్లీ, మే 16: రెండుసార్లు తలాఖ్ నోటీసులు పంపిన తన భర్తపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించనున్నట్లు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్‌ఖన్నాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

05/16/2019 - 22:57

థానె, మే 16: ట్రిపుల్ తలాఖ్ చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా థానెకు చెందిన ఓ వ్యక్తి వాట్సప్‌లో తన భార్యకు తలాఖ్ చెప్పడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు.

Pages