S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/24/2019 - 01:45

షాబాద్, ఏప్రిల్ 23: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ మండల పరిధిలోని తిరుమలపూర్‌లో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలపూర్ గ్రామానికి చెందిన అంజయ్య, అనుసుజ కూతురు జ్యోతి (17) చేవెళ్లలోని వివేకనంద కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుంది. ఇంటర్ ఫెయిలైనాని మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.

04/24/2019 - 01:44

జీడిమెట్ల, ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజాంపేట్ గ్రామం, రాజీవ్ గృహకల్పలో నివాసముండే నాగ ఆంజనేయులు కుమారుడు నాగ హేమంత్ (20) బౌరంపేట్‌లోని డీఆర్‌కే కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి హేమంత్ ద్విచక్ర వాహనం పై ప్రగతినగర్ వైపు వెళ్తున్నాడు.

04/24/2019 - 01:11

నెక్కొండ: ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయ్యాననే మనస్తా పంతో మరో విద్యార్థి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండ లం రెడ్లవాడ శివారు మత్తడితండాకు చెందిన బానోత్ నవీన్ (16) మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నవీన్ గతవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు.

04/24/2019 - 01:09

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫెయిలైన విద్యార్థుల పేపర్లు మళ్లీ మూల్యాంకన చేయవచ్చా?అని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన లంచ్ మోషన్ ప్రజావాజ్యం హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది.

04/24/2019 - 00:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం తీర్పును తప్పుగా ఆపాదించినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

04/23/2019 - 03:51

హైదరాబాద్, ఏప్రిల్ 22: హైదరాబాద్‌లో ఖరీదైన బంగారు షాపులను ఎంచుకుని దోపిడీ చేసే దొంగల ముఠాను అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పట్టుబడిన ముఠా నుంచి 11 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

04/23/2019 - 03:44

రేణిగుంట, ఏప్రిల్ 22: సెల్ఫీలు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినీడుకు చెందిన శివకుమార్ (26) అనే యువకుడు సరదాగా ఫోన్‌లో వీడియో తీసుకుంటూ పొరపాటున ఉరి బిగుసుకుని మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలిలావున్నాయి. శివకుమార్ స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి తిరుపతిలో మద్యం సేవించాడు. ఆపై దామినీడులో ఉన్న తన గదికి వచ్చాడు.

04/23/2019 - 02:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై నిర్మించిన బయోపిక్ చిత్రంపై ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఇసీ) సోమవారం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ బయోపిక్‌పై ఇసీ సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయికి అందజేసింది. ఈ నివేదిక ప్రతి (కాపీ)ని చిత్ర నిర్మాతలకూ అందజేయాల్సిందిగా జస్టిస్ గొగోయి ఇసీని ఆదేశించారు.

04/23/2019 - 02:28

పెనమలూరు, ఏప్రిల్ 22: ఒక వృద్దుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెనమలూరు గ్రామానికి చెందిన వర్రె మత్తయ్య(53) పోరంకి అక్షయ సూపర్ మార్కెట్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా చిన్నకారు వచ్చి ఢీకొంది. దీంతో గాయాలపాలైన మత్తయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.

04/23/2019 - 02:28

పెనమలూరు, ఏప్రిల్ 22: సిమెంట్ గోడౌన్ వద్ద పెట్టిన లారీ కనిపించకుండా పోయిన సంఘటన పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ప్రసాదంపాడుకు చెందిన సిరిపురపు రమేష్‌బాబు లారీ యాజమాని అదివారం కానూరులోని మహాసిమెంట్ గోడౌన్ దగ్గరలో ఏపీ 16పీఎఫ్ 1689 నెంబర్ గల లారీని సిమెంట్ లోడింగ్ కోసం పెట్టి సోమవారం వచ్చి చూస్తే లారీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pages