S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/18/2019 - 01:09

న్యూఢిల్లీ: ఉన్నత స్థాయిలో అవినీతిని నిరోధించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు ఫిబ్రవరి చివరి వరకూ అనే్వషణ ప్యానల్‌కు గడువు ఇచ్చింది. ఈ పదవిలో నియమించేందుకు వీలుగా తమకు ఈ గడువులోగా పలుపేర్లను సిఫార్సు చేయాలని మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారధ్యంలోని కమిటీకి స్పష్టం చేసింది.

01/18/2019 - 04:21

బనగానపల్లె: అత్తింటి ఆరళ్లకు కోడలు, ఇద్దరు చిన్నారులు బలయ్యారు. 15 ఏళ్లుగా ఆ కోడలికి అదనపు కట్నం వేధింపులు తప్పలేదు. మూడోసారి గర్భం దాల్చింది. దీంతో అత్తింటివారు ఆమెపై పగబట్టి గర్భం తీయించుకోవాలని ఒత్తిడి పెంచారు. దానికి ఆ తల్లి ససేమిరా అంది. దీంతో అంతా కలిసి నిద్రిస్తున్న తల్లీబిడ్డలపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో వెంకటలక్ష్మమ్మ(35), పవన్‌కుమార్(13), పావని(9) మంటల్లో కాలిపోయారు.

01/18/2019 - 02:44

పంచకుల (హర్యానా), జనవరి 17: పదహారేళ్ల క్రితం ఓ పాత్రికేయుడ్ని హత్య చేసినట్టు నేరం రుజువుకావడంతో గుర్మిత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా)కు స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. డేరాబాబాతోపాటు మరోముగ్గురికి న్యాయస్థానం శిక్ష విధించింది. మహిళలపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాను గత శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది.

01/17/2019 - 22:36

బనగానపల్లె, జనవరి 17:స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా వరకట్నం దురాచారం సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. వరకట్న పిశాచికి ఇప్పటికే ఎందరో అతివలు బలయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం మండల పరిధిలోని పండ్లాపురం గ్రామంలో వివాహిత తన ఇద్దరు పిల్లలపై డీజిల్ పోసి నిప్పంటించిన సంఘటన ఇందుకు పరాకాష్ఠగా నిలిచింది.

01/17/2019 - 22:36

మంత్రాలయం,జనవరి 17:మండల పరిధిలోని మాధవరం చెక్‌పోస్టు దగ్గర 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శిరీష తెలిపారు.

01/17/2019 - 22:32

నెల్లూరు, జనవరి 17: కళ్లుతెరచి కొత్త ప్రపంచానికి పరిచయమవ్వాల్సిన పసికందు మాతృగర్భం నుండి బయటకు వస్తూనే కనుమూసేసింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ చనిపోయిందంటూ పసికందు కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం నగరంలోని ప్రభుత్వ ప్రధానసుపత్రి ప్రాంగణంలోని జూబ్లీ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పాటు సేకరించిన సమాచారం మేరకు..

01/17/2019 - 22:26

సంతమాగులూరు, జనవరి 17 : ఉదయం పూట దట్టంగా అలముకున్న పొగ మంచు ఒక వ్యక్తిని బలిగొంది. రోడ్డుపై పట్టిన మంచులో మోటార్‌బైక్‌పై వస్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో బోల్తా కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో ఏల్చూరు సమీపంలో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

01/17/2019 - 22:26

ఒంగోలు, జనవరి 17 : అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్‌పి బి సత్యఏసుబాబు తెలిపారు. నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 31 కేసులు ఛేదించడంతోపాటు మొత్తం రూ.14 లక్షల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు.

01/17/2019 - 22:03

నర్సీపట్నం, జవనరి 17: పట్టణంలోని శారదానగర్ వీధి వెలమ సంఘం భవనం సమీపంలో నివాసం ఉంటున్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రోలుగుంట పీహెచ్‌సీ పరిధిలోని బుచ్చింపేట హెల్త్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కొరుప్రోలు వెంకటరమణ సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన గొలుగొండ మండలం చోద్యంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్ళారు.

01/17/2019 - 21:54

పూసపాటిరేగ, జనవరి 17: మండలంలోని అల్లాడపాలెం గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన అడ్డగర్ల శ్రీను కత్తితో భర్మాంగంపై దాడి చేయడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్సై బాలాజీ రావు అందించిన వివరాల ప్రకారం అల్లాడపాలెం గ్రామానికి చెందిన 30 ఏళ్ళ మహిళతో అదే గ్రామానికి చెందిన శ్రీనుతో పరిచయం ఏర్పడింది. తరువాత ఆమెను శారీరక వాంఛతీర్చాలంటూ వేధించేవాడు.

Pages