S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/17/2019 - 00:01

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఓ పోలీసు కానిస్టేబుల్ శుక్రవారం సాయంత్రం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణకుమార్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న తిరుపతిరెడ్డి అనే కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

08/17/2019 - 00:00

మిర్యాలగూడ, ఆగస్టు 16: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది.

08/16/2019 - 23:26

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఉత్తరాఖండ్ వ్యాప్తంగా నాలు గు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 900 కిలోమీటర్ల మేర చేపట్టనున్న చార్‌ధామ్ హైవే నిర్మాణంపై సుప్రీంకోర్టు తాజాగా పలు సూచనలు చేసింది. గతంలో నేషన ల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చేసిన మార్పులను సవరిస్తూ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.

08/16/2019 - 23:26

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషీకి పదోన్నతికి కల్పిస్తూ వారం రోజుల్లోగా చర్యలు తీసుకొంటామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.

08/16/2019 - 23:25

న్యూఢిల్లీ, ఆగస్టు 16: మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 2016లో నాగాలాండ్‌లో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్‌ఎస్ జస్వాల్ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మిలటరీ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి.

08/16/2019 - 23:04

తడ, ఆగస్టు 16: నెల్లూరు జిల్లా తడ మండల పరిధిలోని పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న ఇరకం దీవి నుంచి భీములవారిపాళెంకు వస్తున్న బోటు శుక్రవారం ఆకస్మికంగా బోల్తాపడింది. ఈ సంఘటనలో పడవలో ఉన్న ముగ్గురు చిన్నారులు, మరో దివ్యాంగుడు ప్రాణభయంతో అస్వస్థకు గురైయ్యారు. ఇరకం దీవిలోని తిరువెంగడనగర్‌లోని మత్స్యకార గ్రామంలో తిరునాళ్లు జరుగుతున్నాయి.

08/16/2019 - 22:57

హైదరాబాద్, ఆగస్టు 16: అంధుడికి ఉద్యోగం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, సరోజనీదేవీ కంటి వైద్యశాఖ సూపరింటెండెంట్‌లపై హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద ఆయనకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దృష్టిలోపం ఉన్న మురళీధర్ బ్లైండ్ రిజర్వేషన్ కోటాలో క్లాసు ఫోర్ బ్యాక్‌లాగ్ టైపిస్టు పోస్టుకు ఎంపికయ్యారు.

08/16/2019 - 22:36

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత తీవ్రమైన ఈ అంశంపై దాఖలైన సవాళ్ల పిటిషన్లలో ఎన్నో లోపాలు ఉన్నాయని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది.

08/16/2019 - 22:25

న్యూఢిల్లీ, ఆగస్టు 16: స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రూ. 299.98 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది.

08/16/2019 - 22:24

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్ కాపీలను కోర్టుకు సమర్పించారు. ఏ ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Pages