S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/23/2019 - 02:48

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు నెల రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని చత్రినాక పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

01/23/2019 - 01:47

న్యూఢిల్లీ, జనవరి 22: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

01/23/2019 - 01:21

వనస్ధలిపురం, జనవరి 22: వంటగదిలో గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి వృద్ధురాలు మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్ సోమనాథ క్షేత్రంలోని వంటగదిలో అక్కడే నివాసం ఉంటున్న శృతి కీర్తి (80) లలితా (30) మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వంట చేస్తున్నారు.

01/23/2019 - 01:20

వికారాబాద్, జనవరి 22: వార్డు అభ్యర్థిగా పోటీలో వున్న వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో జరిగింది. బాధితుడు బేగరి జనార్ధన్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నర్సింలు, శ్రీనివాస్‌లు తనపై దాడి చేసి కొట్టారని తెలిపారు. గత 15 రోజులుగా పోటీలో ఉన్న మాజీ సర్పంచ్ గురువారెడ్డి భార్యకు మద్దతివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పాడు.

01/23/2019 - 01:20

శేరిలింగంపల్లి, జనవరి 22: చట్టవిరుద్ధంగా నిషేధిత గంజాయిని తరలిస్తు న్న ముఠా సభ్యులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్‌ల నుంచి మూడు కిలోల గంజాయి, రూ.5వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్‌పెక్టర్ బీ.రవీందర్ కథనం ప్రకారం...

01/23/2019 - 01:16

రాజేంద్రనగర్, జనవరి 22: రాజేంద్రనగర్ సర్కిల్లో పట్టపగలే భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించి పకడ్భందీగా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏక మొత్తంగా సుమారు రూ.4 లక్షల నగదు, 18 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. వివరాల ప్రకారం...

01/23/2019 - 00:59

కీసర: మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే- మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరావు, మల్కాజ్‌గిరి శివపురి కాలనీలోగల మత్స్య మహిళా పారిశ్రామిక సహకార సొసైటీకి రివాల్వింగ్ ఫండ్ మూడు లక్షలు ప్రభుత్వం నుండి అందజేయాల్సి ఉంది.

01/22/2019 - 22:46

తుళ్లూరు, జనవరి 22: అమరావతి సందర్శనకు వచ్చి హైకోర్టు ప్రాంగణం వద్ద జరిగిన ప్రమాదంలో పెద్ది భాస్కరరావు (38) అనే వ్యక్తిమృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన భాస్కరరావు తన బావమరిదితో కలిసి ద్విచక్ర వాహనంపై రాజధాని నిర్మాణ పనులను తిలకించేందుకు వెళ్లారు. హైకోర్టును సందర్శించి బయటకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది.

01/22/2019 - 22:40

చిత్తూరు, జనవరి 22: కోళ్లను దొంగలించాడన్న అనుమానంతో యువకున్ని కాళ్లూ చేతులు కట్టి వేసి విచక్షణారహితంగా చితక బాదిన సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ వెంకటకుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమూరు మండలం ఓబయ్య గారిపల్లికి చెందిన వేణుగోపాల్ చిత్తూరు నగరంలోని చికెన్ సెంటర్‌కు కోళ్లను సరఫరా చేసే వాహనానికి డ్రైవర్‌గా పని చేసేవాడు.

01/22/2019 - 22:39

చిత్తూరు, జనవరి 22: ఆధునిక సమాజంలో టెక్నాలజీ వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో పిల్లల పెంపకంలో సరైన పర్యవేక్షణ లేకపోతే ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటన దర్పణం పడుతుంది. చిన్నారులు ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్టు చేసిన వ్యవహారం చిత్తూరు నగరంలో పెద్ద దుమారమే లేపింది.

Pages