S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/15/2019 - 05:36

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 14: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడడంతో ఆ వ్యక్తి మృతికి కారణమయ్యానని మనస్థాపంతో భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....

08/15/2019 - 05:35

ఉప్పల్, ఆగస్టు 14: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయిన బైక్ మెకానిక్ షేక్ సాజిత్ అలీ (18) మృతదేహం బుధవారం లభ్యమైంది. గజ ఈతగాళ్ల శ్రమ ఫలించింది. మలక్‌పేటకు చెందిన సాజిత్ అలీ స్నేహితులతో కలిసి నారపల్లి పెద్ద చెరువు వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. సరదాగా ఈత కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు.

08/15/2019 - 05:34

ఉప్పల్, ఆగస్టు 14: హిజ్రాల వేషంతో.. ఆటోలలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి బుధవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పట్టుబడ్డవారిలో బోడుప్పల్ కళానగర్‌కు చెందిన తూర్పాటి యాదయ్య (32), సదుల ఆంజనేయులు అలియాస్ అంజయ్య (28), కల్లెం బాలయ్య అలియాస్ బాబు (28) ఉన్నారు. వీరు బిచ్చం అడుక్కుంటూ జీవనం గడుపుతున్నారు.

08/15/2019 - 05:09

న్యూఢిల్లీ, ఆగస్టు 14: అయోధ్య కచ్చితంగా రామజన్మ స్థానమేనని, పలువురు యాత్రీకులు చేసిన రచనలే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని ‘రామ్ లాలా’ కమిటీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

08/15/2019 - 01:08

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం కుదించిన భద్రతను పెంచాలని రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పిచ్చింది. తన భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ అంశంపై హైకోర్టులో ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు తుది తీర్పును వెల్లడించారు.

08/14/2019 - 23:35

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 14: విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ చివరకు కటకటాల పాలయ్యారు. విశాఖ జిల్లా ఆనందపురం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. స్థానిక పెద్దిపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సుందరరావు, ఉపాధ్యాయుడిగా వెంకటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు.

08/14/2019 - 23:21

నెల్లూరు, ఆగస్టు 14: జాతీయ రహదారులపై రెక్కీ నిర్వహిస్తూ విలువైన వస్తువులతో వెళ్లే కంటైనర్లను దారి మళ్లించి డ్రైవర్లను అతి కిరాతకంగా హత్యచేసి సరకులతో సహా ఆనవాళ్లు లేకుండా పరారయ్యే మధ్యప్రదేశ్‌కు చెందిన అత్యంత క్రూరమైన కంజర్‌భట్ గ్యాంగును నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. అక్కడి పోలీసులు పెద్దగా సహకరించకపోయినా నెల్లూరు పోలీసులు అత్యంత సాహసోపేతంగా ఈ కేసును చేధించారు.

08/14/2019 - 06:23

హైదరాబాద్, ఆగస్టు 13: మున్సిపల్ ఎన్నికలపై గత పక్షం రోజులుగా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ బుధవారం నాటికి వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై వాదనలను బుధవారం నాడు వింటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజే విచారణలను చేపట్టాలన్న ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది.

08/14/2019 - 05:54

న్యూఢిల్లీ, ఆగస్టు 13: శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యే పూజనీయమైన స్థలం అని, దీని దృష్ట్యా 2.77 ఎకరాల వివాదస్పద స్థలంలో ముస్లింలు ఎంత మాత్రం భాగాన్ని కోరజాలరని రాంలల్లా విరాజమాన్ సంస్థ మంగళవారం సుప్రీం కోర్టులో తమ వాదన వినిపించింది.

08/14/2019 - 05:01

సనత్‌నగర్, ఆగస్టు 13: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సతన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. తుక్కుగూడాలో నివాసం ఉండే నర్సింగ్‌దాస్ పాత నేరస్థుడు. ఒక మర్డర్ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతనికి శత్రువులు అధికంగా ఉన్నారు.

Pages