S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/14/2019 - 04:59

షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 13: బక్రీద్ పండుగకు ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరి జరిగిన సంఘటన షాద్‌నగర్ పట్టణంలోని ప్యారడైజ్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం షాద్‌నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ సోదరుడు సయ్యద్ జమీల్ ప్యారడైజ్ కాలనీలో కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు.

08/14/2019 - 04:57

ఉప్పల్, ఆగస్టు 13: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నల్గురిలో ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మలక్‌పేట్‌లో నివసిస్తున్న షేక్ వాహెద్ అలీ కుమారుడు షేక్ సాజిద్ అలీ (18) బైక్ మెకానిక్. అతడు ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం నారపల్లిలోని పెద్ద చెరువు వద్దకు వచ్చారు. చేపలు పట్టేందుకు వచ్చిన వీరు సరదాగా ఈతకు ఉపక్రమించారు.

08/14/2019 - 00:42

కమలాపురం : కడప జిల్లా కమలాపురం సమీపంలోని కుందూనదిలో నలుగురు కొట్టుకుపోయారు. ఒకరి మృతదేహం లభించగా, ముగ్గురు పిల్లల కోసం గాలిస్తున్నారు. బక్రీద్ పండుగ మరుసటిరోజు వనభోజనానికి వెళ్లిన ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కమలాపురం పట్టణంలోని దర్గావీధికి చెందిన జాఫర్ హుస్సేన్ ఇరుగుపొరుగు ముస్లిం కుటుంబాలు కలిసి 3 నదుల సంగమమైన మూలగడ్డ వద్దకు మంగళవారం వనభోజనానికి వెళ్లారు.

08/14/2019 - 00:36

న్యూఢిల్లీ, ఆగస్టు 13: జమ్మూకాశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఆంక్షల రద్దుకు ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

08/13/2019 - 23:25

న్యూఢిల్లీ, ఆగస్టు 13: తమపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను వెంటనే విచారించాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అంశాన్ని అత్యవసరంగా విచారణ జాబితాలో పెట్టాలంటూ కోర్టు రిజిస్ట్రార్‌కు ఓ మెమో అందించాలని సుప్రీంకోర్టు వారిని సూచించింది.

08/13/2019 - 23:40

న్యూఢిల్లీ : మానవ హక్కుల కోర్టుల ఏర్పాటులో 2018 సంవత్సరం జనవరిలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయని ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. స్పందించని ఈ రాష్ట్రాలు లక్ష రూపాయిల వరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం సుప్రీం ఆదేశాలకు స్పందించడం కానీ.. కోర్టుకు హాజరు కావడం కానీ చేయలేదనీ..

08/13/2019 - 23:09

విజయవాడ (క్రైం), ఆగస్టు 13: శ్రీనగర్ కాలనీలో వివాహిత హత్య కేసు పోలీసులకు తలభారంగా మారింది. హతురాలు మణిక్రాంతి శిరస్సు కోసం ఏలూరు కాల్వను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాల గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా ఇంతవరకూ నీటిలో పడేసిన మణిక్రాంతి తల ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

08/13/2019 - 06:50

ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 12: క్యారీకి తీసిన గుంతలో ఉన్న నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఖమ్మంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బక్రీదు సెలవురోజు కావడంతో నగరంలోని వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన స్నేహితులు షేక్ మున్నా(9), షేక్ నాగులు(9) ఈతకు వెళ్ళారు.

08/13/2019 - 06:49

గార్ల, ఆగస్టు 12: వేగంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోని పాకాల ఏరు రైల్వే వంతెన వద్ద సోమవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది.

08/13/2019 - 05:05

న్యూఢిల్లీ, ఆగస్టు 12: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు దైనందిన విచారణ మంగళవారం సాగనుంది. ఐదో రోజు విచారణ కీలకపైన అంశంపై సాగనుంది. శుక్రవారం రామ్‌లల్లా విజరాజ్‌మన్ సంస్థ తరఫున పరాశరన్ వాదనలు వినిపించారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.

Pages