S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/11/2019 - 22:01

తిరువంతనపురం/ముంబయి/బెంగళూరు/ గాంధీనగర్, ఆగస్టు 11: కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళలలో వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 157కు పెరిగింది. ఈ రాష్ట్రాల్లో ఇంకా వరద బీభత్స పరిస్థితి కొనసాగుతూనే ఉంది. కర్నాటకలో దాదాపు అన్ని నదులు వరద తాకిడికి ఉప్పొంగుతున్నాయి. ఓ రిజర్వాయర్ నుం చి ఆదివారం ఉదయం 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కర్నాటకలోని హంపి మునిగిపోయింది.

08/11/2019 - 21:26

సూర్యాపేటరూరల్, ఆగస్టు 11: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాటోత్‌తండాకు చెందిన ధరావత్ శంకర్, మల్లమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

08/11/2019 - 21:23

నిజామాబాద్, ఆగస్టు 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌లోని హజ్రత్ సయ్యద్‌షాదుల్లా హుస్సేనీ దర్గా(బడాపహాడ్)ను దర్శించుకునేందుకు వచ్చిన నలుగురు యువకులు అనుకోని రీతిలో ఎలుగుబంట్ల బారినపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో జహంగీర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

08/11/2019 - 00:14

నల్లగొండ, ఆగస్టు 10: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు.

08/11/2019 - 00:01

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముమ్మారు తలాక్‌ను రద్దు చేసినప్పటికీ అందుకు పాల్పడి భార్యకు విడాకులిచ్చిన ఒక వ్యక్తిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. ముమ్మారు తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరమంటూ తాజా చట్టం నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.

08/11/2019 - 00:01

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి హత్యకేసు నుంచి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్, అతడి సోదరుణ్ని సీబీఐ రక్షిస్తోందని న్యాయవాదులు ధర్మేంద్ర మిశ్రా, పూనమ్ కౌషిక్ ఆరోపించారు. ఈమేరకు జిల్లా జడ్జి ధర్మేంద్ర శర్మ ఎదుట హాజరై సీబీఐపై ఫిర్యాదు చేశారు.

08/10/2019 - 23:21

విజయవాడ, ఆగస్టు 10: విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లిలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఒకదాని తరువాత మరొకటిగా 110 గోవులు మృత్యువాత పడగా, వందలాది గోవులు కొనఊపిరితో విలవిలాడుతున్నాయి. గోవుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. రాత్రి గోవులు తిన్న దాణాలో ఎరువుల మోతాదు ఎక్కువై విషపూరితంగా మారి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

08/10/2019 - 23:20

హైదరాబాద్, ఆగస్టు 10: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు రూ.3.46 కోట్ల విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి 9.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.46 కోట్ల వరకు ఉంటుదని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

08/10/2019 - 23:18

హైదరాబాద్, ఆగస్టు 10: విహార యాత్ర కోసం వెళ్లిన నాగోల్ మోహన్‌నగర్‌లో నివసించే వైద్యుడు చంద్రశేఖర్‌రెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కులూమనాలిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పారాచ్యూట్ ద్వారా గాలిలోకి ఎగిరిన ఆయన ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

08/10/2019 - 22:35

మావ్లమైన్ (మైన్మార్), ఆగస్టు 10: ఈశాన్య మైన్మార్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో మృతుల సంఖ్య 34కు చేరుకుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు శనివారంనాడు వెల్లడించాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Pages