S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/17/2018 - 03:49

విజయవాడ(పెనమలూరు), అక్టోబర్ 16: ఐటీ అధికారుల వేధింపులకు లారీ బాడీ బిల్డింగ్ యూనిట్ యజమాని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని సనత్‌నగర్‌కు చెందిన సాదిక్(46) 26ఏళ్లుగా జవహర్ ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్ యూనిట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొనే్నళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఐటీ అధికారులు అతని యూనిట్‌కు వచ్చి రూ.

10/17/2018 - 03:48

త్రిపురాంతకం, అక్టోబర్ 16: నాగార్జున్‌సాగర్ కాలువలో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇరువురు మహిళలు మృతి చెందిన సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో జరిగింది. వివరాల మేరకు దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన బచ్చలపురి కోటేశ్వరమ్మ (43) దూపాడులో ఉన్న అల్లుడి ఇంటికి వచ్చింది.

10/17/2018 - 01:56

మధురైలోని ఓ ఆలయం నుంచి చౌర్యానికి గురైన ప్రాచీన పంచలోహ విగ్రహాలను
పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రదర్శిస్తున్న దృశ్యమిది

10/17/2018 - 04:06

హైదరాబాద్, అక్టోబర్ 16: మహానగరంలో మంగళవారం ఆకస్మికంగా కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో దాదాపు అరగంటసేపు వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన మహానగరవాసులు ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో కాస్త ఊరట చెందారు. కానీ ఆకస్మికంగా వర్షం కురవటంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు రహదారులు జలమయమై కాసేపు వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.

10/17/2018 - 01:42

జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 16: మండలంలోని రావికంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మంగొల్లు రోడ్డులోని స్పాట్స్ (స్పిన్నింగ్ మిల్) కర్మాగారంలో మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆరు బ్లాక్‌లుగా ఉన్న కర్మాగారంలో ఒక బ్లాక్‌లో మొదలైన మంటలు కొద్ది సమయంలోనే మిగిలిన వాటికి వ్యాపించాయి.

10/17/2018 - 01:15

చీరాల టౌన్, అక్టోబర్ 16: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా చీరాల, కొత్తపేట బైపాస్ రోడ్డులో ఆర్టీఏ కార్యాలయం వద్ధ మంగళవారం బి ఫార్మసీ విద్యార్థి దుర్మణం చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. టూటౌన్ సిఐ రామారావు తెలిపిన వివరాల మేరకు, చీరాల మండలం బుర్లవారిపాలెంకు చెందిన దేవరపల్లి హకిల్ (24) కుటుంబం విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాల సమీపంలో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

10/17/2018 - 00:18

హైదరాబాద్, అక్టోబర్ 16: తమ కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి వేలకోట్ల రూపాయలు వసూలు చేసిన ‘హీరాగోల్డ్’ గుట్టు బట్టబయలైంది. ఇటీవల కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటనతో హీరాగోల్డ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయిది.

10/16/2018 - 21:57

చెన్నై: రెండున్నరేళ్ల కుమార్తెను బ్లేడుతో కోసి హత్యచేసి తాము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంపతుల ఉదంతం ఇది. ఈ ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లా దిట్టకుడి సమీపంలో జరిగింది. ఇడైసెరువాయ్ కాలనీకి చెందిన మరుదముత్తు(30) ఉషా దంపతులు గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరు తమ స్వగ్రామానికి వచ్చారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

10/16/2018 - 03:21

ఆత్మకూరు, అక్టోబర్ 15: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం రూ.7 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం హౌసింగ్ ఏఈ రంగస్వామిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన లబ్దిదారుడు రాజశేఖర్ 2006లో మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఏఈని సంప్రదించగా ఆయన రూ. 10వేలు లంచం అడిగాడు.

10/16/2018 - 02:12

పెనుగంచిప్రోలు, అక్టోబర్ 15: తిరుపతమ్మ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఒక హిజ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట్ల గ్రామానికి చెందిన పాలకూటి రామయ్య ఎలియాస్ రమ్య తన 8మంది స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం తిరుపతమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు.

Pages