S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/24/2019 - 04:45

హైదరాబాద్, జూలై 23: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత అంశంపై మంగళవారం నాడు హైకోర్టులో సుదీర్ఘవాదనలు జరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని వారసత్వ సంపదను ఏ చట్టం ద్వారా పరిరక్షిస్తున్నారో తేటతెల్లం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

07/24/2019 - 04:30

సీతంపేట, జూలై 23: గడచిన కొనే్నళ్లుగా ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో మావోల డంప్ కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి జిల్లాలో మావోల కదలికలు లేవని చెప్పిన కొద్దిరోజుల్లోనే ఏజెన్సీ ప్రాంతంలో మావోలకు చెందిన డంప్ దొరకడం చర్చనీయాంశమైంది. సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలోని దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనకోట అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ను పోలీసులు మంగళవారం గుర్తించారు.

07/24/2019 - 04:25

తిరుపతి, ఆగస్టు 23: ప్రముఖులు బసచేసే పద్మావతి అతిథి భవనాల ప్రాంతంలో చోరీ జరిగి 10 రోజులు కూడా గడవక ముందే మరోమారు సోమవారం రాత్రి సన్నిధానం అతిథిభవనంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన పుల్లయ్య అనే భక్తుడు సోమవారం శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నాడు. సన్నిధానంలో 47వ గదిని అద్దెకు తీసుకున్నాడు.

07/24/2019 - 04:24

మలికిపురం, జూలై 23: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెళ్ళంక వద్ద మంగళవారం ఉదయం స్కూటరు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు బాలికలు, మరో యువతి మృతిచెందారు. మృతిచెందిన బాలికలిద్దరూ అక్కాచెల్లెళ్లు కాగా, మృతిచెందిన యువతి వారికి పెద్దమ్మ. ఈ ప్రమాదం నుండి బాలికల తల్లి, మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలావున్నాయి...

07/24/2019 - 04:04

తిరుపతి, జూలై 23: చిత్తూరు జిల్లా నగరి మండల పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి కనుమమిట్ట వద్ద మంగళవారం రాత్రి 10.30 గంటలకు రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ఇద్దరిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు తలనీలాలు సమర్పించి ఉండటంతో తిరుమలకు వెళ్లి వస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

07/24/2019 - 02:17

న్యూఢిల్లీ: అస్సాం జనాభా లెక్కలకు సంబంధించి జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితా ప్రచురణ గడువును సుప్రీంకోర్టు ఆగస్టు 31 వరకు పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం నమూనా జాబితాను సరిచూసుకొనే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ప్రచురణ గడువును మరో నెల పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

07/24/2019 - 01:37

హైదరాబాద్, జూలై 23: ఇళ్లకు వెళ్లి అరబిక్ నేర్పిస్తానని బాలకపై లైంగిక దాడికి పాల్లడిన సంఘటనలో నిందితుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన అబ్దుల్ ఖయ్యూం(23) ఐదేళ్ల నుంచి చాంద్రాయణగుట్ట జీఎం చౌహుని కాలనీలోని నివాసం ఉంటున్నాడు.

07/24/2019 - 01:36

నేరేడ్‌మెట్, జూలై 23: మల్కాజ్‌గిరి మున్సిపాల్ కార్యాలయం లంచావతారుల నిలయంగా మారిపోయింది. నిత్యం ప్రజలను లంచాలతో జలగల పీలుస్తున్న మున్సిపాల్ అధికారుల గుండెల్లో ఎసీబీ దాడులతో రైళ్లు పరుగెత్తాయి. ఏసీబీ డీఎస్పీ అచ్యుతరావు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్‌గిరి సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్గాదాస్..

07/24/2019 - 01:36

గచ్చిబౌలి, జూలై 23: సెకండ్ హ్యాండ్‌లో ఏదైనా వస్తువు కొనాలంటే ముందు ఆన్‌లైన్‌లో వెతుకుతాము. వస్తువు కొనుగోలు చేసేందుకు ఓఎల్‌ఎక్స్, క్వికర్ లాంటి వెబ్‌సైట్‌ట్లు పరిశీలిస్తాము. తక్కువ ధర కలిగిన వస్తువులు మొదలుకొని లక్షల రూపాయల విలువ చేసే కార్లు, స్థలాలు, ఇళ్లు వంటి సమాచారం వెబ్‌సైట్‌లో ఉండడంతో ప్రజలు క్రయా విక్రయాలను ఆన్‌లైన్‌లో సాగిస్తున్నారు.

07/24/2019 - 01:35

హైదరాబాద్, జూలై 23: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌ను సీసీఎస్, డీడీ విభాగం పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

Pages