S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/16/2018 - 23:15

కదిరి రూరల్, జూలై 16: కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంలో నివాసముంటున్న మహమ్మద్ హనీఫ్ కుమారుడు హసేన్‌బాషా (22) సోమవారం కర్నాటక రాష్ట్రం బిళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. హుసేన్‌బాషా చెల్లె అయిన యాష్మిన్‌ను బిళ్లూరుకు చెందిన ఓ అబ్బాయితో వివాహం చేశారు.

07/16/2018 - 22:59

పామూరు, జూలై 16: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొనడంతో 20 అడుగుల లోతులో గల చప్టా నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం పామూరు పంచాయతీ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లికి చెందిన టి ఖాజామస్తాన్ (32) అక్కడికక్కడే మృతిచెందాడు. ఖాజామస్తాన్‌కు ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు.

07/16/2018 - 22:59

మేదరమెట్ల, జూలై 16 : ముందు వెళుతున్న లారీని వెనుక నుండి అజాగ్రత్తగా మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ జిల్లా వికారాబాద్‌కు చెందిన తేమల మధుకర్‌రెడ్డి తన సొంత లారీని డ్రైవర్‌గా వెళుతుంటాడు.

07/16/2018 - 22:56

కావలి, జూలై 16: కావలి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా బెట్టింగ్ ముఠా చెలరేగిపోతోంది. బెట్టింగ్ నగదు కోసం ఏకంగా వ్యక్తులను అపహరించడం, నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయడంలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి అప్పుల ఊబిలో చిక్కుకుని యువకులు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

07/16/2018 - 22:42

గార్ల, జూలై 16: పవిత్రమైన దేవాలయాల్లో, ఇండ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకోవటంతో పాటు ఆరు లక్షల 85 వేల రూపాయాల రెండు వందల రూపాయాల విలవైన బంగారం, వెండి, ఇత్తడి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

07/16/2018 - 22:39

అన్నపురెడ్డిపల్లి, జూలై 16 : మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామంలో కారు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది.

07/16/2018 - 22:35

కర్నూలు, జూలై 16 : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రకాష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపింది. వివరాలు.. నగరంలోని బుధవారపేటకు చెందిన ప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై భార్య తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు.

07/16/2018 - 22:26

లక్కవరపుకోట, జూలై 16: స్థానిక పోలీసులు మిస్సింగ్ మిస్టరీ చేధించారు.

07/16/2018 - 04:40

వరంగల్ క్రైం, జూలై 15: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (కేకేడబ్ల్యూ) జిల్లాల కార్యదర్శి దామోదర్‌కు కొరియర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా సివిల్ లిబర్టీ కమిటీ కార్యదర్శి రమేష్ చం దర్‌ను శనివారం సాయంత్రం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 5లక్షల నగదు, విప్లవ సాహిత్యం, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

07/16/2018 - 04:40

భీమదేవరపల్లి, జూలై 15: ముల్కనూరులో 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని నాలుగు వాహనాలను సీజ్ చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ముల్కనూరు ఎస్సై డేగల రమేష్ తెలిపారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంగల్‌దుబ్బ వద్ద శ్యాంసుందర్‌రెడ్డి ఇంటి వద్ద రెండు గదులలో నిలువ ఉంచి న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Pages