S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/30/2018 - 04:12

న్యూఢిల్లీ: పేపర్‌లీక్‌తో పాటు పలు అవకతవకలు జరిగాయని భావిస్తున్న స్ట్ఫాసెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్‌ను రద్దు చేసి, తాజాగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) లేదా సిబిఎస్‌ఈ ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టులో వెలువడిన ఈ పరీక్ష ఫలితాలపై కోర్టు ఇప్పటికే స్టే విధించింది.

10/30/2018 - 04:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సుప్రీం కోర్టులో మహారాష్ట్ర పోలీసులకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోరేగావ్ -భమా అల్లర్ల కేసులో చార్జిషీట్ దాఖలుకు సుప్రీం కోర్టు మరికొంత గడువుఇచ్చింది. కేసు దర్యాప్తు, చార్షిషీట్ దాఖలుకు గడువుఇవ్వాలంటూ మహారాష్ట్ర పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

10/30/2018 - 00:38

న్యూఢిల్లీ: నూతన రాజధానిలో అమరావతిలో డిసెంబరు 15 నాటికి తాత్కాలికంగా హైకోర్టు భవన నిర్మాణం పుర్తవుతుందని సుప్రీం కోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నవించింది. హైదరాబాద్‌లోనే రెండు హైకోర్టులు ఎందుకు ఉండకూడదంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది.

10/30/2018 - 00:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసు విచారణ షెడ్యూల్‌ను జనవరి మొదటివారంలో నిర్ధారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని సముచిత ధర్మాసనం నిర్ణయిస్తుందని ప్రధాని న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ప్రకటించింది.

10/30/2018 - 00:26

హైదరాబాద్, అక్టోబర్ 29: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు బ్యాగ్‌లు, సెల్‌ఫోన్‌లు దొంగలించిన నాలుగురు సభ్యులు కలిగిన ముఠాను నగర పోలీసులు పట్టుకుని వారి నుంచి ద్విచక్రవాహ నం, బంగారు అభరణాలు స్వాధీ నం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం మధ్యా హ్నం జరిగిన విలేఖరుల సమావేశం లో నగర పోలీస్ కమిషనర్ వివిధ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

10/30/2018 - 00:20

నాచారం : రైల్వే ఉద్యోగాల పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం ఎస్‌ఓటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపిన కథనం ప్రకారం..

10/30/2018 - 00:07

తాండూర్, అక్టోబర్ 29: మండల కేంద్రంలోని చెక్‌పోస్టువద్ద సోమవారం రూ. 3.40 కోట్లును పోలీసులు పట్టుకున్నారు. చెక్‌పోస్టువద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కరీంనగర్ నుండి ఆసిఫాబాద్‌కు వెళ్తున్న వాహనంలో రూ. 3.44 కోట్లును పోలీసులు గుర్తించారు. తాండూర్ తహసీల్దార్ నాగరాజు, సీఐ ఉపేందర్, మా దారం, తాండూర్ ఎస్‌ఐలు రాములు, రవిలు చెక్‌పోస్టు వద్దకు చేరుకొని విచార ణ చేశారు.

10/30/2018 - 00:01

ఆర్మూర్, అక్టోబర్ 29: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో గల పూసల వీధిలో ఉండే మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, ఆరున్నర తులాల వెండితో పాటు నగదును దొంగిలించినట్లు బాధితులు సోమవారం తెలిపారు.

10/29/2018 - 23:47

వలేటివారిపాలెం, అక్టోబర్ 29: మండలంలోని కలవళ్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీ గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన మోదేపల్లి కృష్ణ (32) ఉపాధిహామీ పనికి వెళ్లి పనిచేస్తుండగా గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కూలీలు తెలిపారు.

10/29/2018 - 23:45

మార్కాపురం, అక్టోబర్ 29: కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పందరబోయిన ఇంద్రకళావతి (20) అనుమానాస్పద మృతిని పరువుహత్యగా చూసేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదని మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఎలా మృతిచెందింది అనేదానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Pages