S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/03/2019 - 22:24

ముదినేపల్లి, : వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదినేపల్లి మండలం శింగరాయపాలెంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కానుబోయిన సాయి గణేష్‌కు, కలిదిండి మండలం మూలలంక గ్రామానికి చెందిన విజయ భారతి(21)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.1.5 లక్షల నగదు, అర ఎకరం పొలాన్ని కట్నంగా ఇచ్చారు.

05/03/2019 - 22:00

కంఠేశ్వర్ (నిజామాబాద్), మే 3: జిల్లా కేంద్రమైన కంఠేశ్వర్‌లో జంట హత్యల సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఇద్దరు యువకుల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండటం, ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు నెలల క్రితం ముగ్గురు యువకులు కలిసి కంఠేశ్వర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

05/03/2019 - 21:58

చౌటుప్పల్, మే 3: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం శివారులోని టింబర్ డిపోల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా ఆస్తినష్టం ఏర్పడింది. ప్రమాద సంఘటనను పరిశీలించేందుకు వెళ్లిన చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. చేయికి గాయమైంది.

05/03/2019 - 21:58

మహబూబాబాద్, మే 3: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలకేంద్రంలో మూడు పవన్‌కుమార్ అనే అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రూ. 6.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను తెలిపారు.

05/03/2019 - 21:57

మహబూబాబాద్/జన్నారం/నల్లగొండ/రాయకోడ్, మే 3: రాష్ట్రంలో ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రచండ భానుడి ప్రతాపంతో జనం ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురువారం రాత్రి, శుక్రవారం నలుగురు వడదెబ్బతో అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు.

05/03/2019 - 21:55

యాదగిరిగుట్ట, మే 3: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై భక్తుల సౌకర్యార్ధం వేసిన చలువ పందిళ్లకు శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. దేవాలయ సిబ్బంది పాత పైళ్లను, చెత్తను దగ్ధం చేస్తున్న క్రమంలో కొన్ని నిప్పురవ్వలు స్టాల్స్‌పైన వేసిన చలువ పందిళ్లకు అంటుకుని మంటలు రేగాయి. ఒక్కసారిగా మంటలు రేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.

05/03/2019 - 02:19

న్యూఢిల్లీ, మే 2: భారత వైమానిక దళంలో జవాన్‌గా పని చేస్తున్న బూర్ల వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దుల్‌పూర్-ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్ల మధ్య బూర్ల వెంకటేష్ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన రైలు వద్దకు చేరుకున్న పోలీసులు, వైమానిక దళ ఉన్నతాధికారులు ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే జవాను మృతికి ఇంకా కారణాలు తెలియలేదు.

05/03/2019 - 02:04

విజయవాడ పశ్చిమ, మే 2: భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా చేతిలో భంగపాటుకు గురై మనోవేదనతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బాధితుడు 4 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. మూలపాడుకు చెందిన జొన్నకూటి అమృతరావు (29) గత నెల 29న తెల్లవారుఝామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం విదితమే.

05/03/2019 - 02:04

నందివాడ, మే 2: మండలంలోని జనార్థనపురంలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తలుపుగడియ తీసి ఇంట్లోకి ప్రవేశించి రూ. 40లక్షలు విలువ చేసే బంగారం, 5వేలు నగదు దొంగిలించిన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. నందివాడ పోలీసుల కథనం ప్రకారం జనార్థనపురం గ్రామంలోని మలిరెడ్డి రాందాసు రెడ్డి కుటుంబం పశ్శిమ గోదావరి జిల్లా తణుకులో నివాసం ఉంటారు.

05/03/2019 - 01:54

శంషాబాద్, మే 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కిలోబంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుఝామున దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అతిని వద్దనున్న కిలో బంగారానికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కస్టమ్స్ అధికారులు బంగారంతో పాటు అతిన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Pages