S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/12/2019 - 23:28

హైదరాబాద్, ఏప్రిల్ 12: టీఆర్‌ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. విలీనంపై వివరణ ఇవ్వాలని ఆకుల లలిత, కే దామోదర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకరరావు, టీ సంతోష్‌కుమార్‌లకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు మహ్మద్ అలి షబ్బీర్‌కు కూడా వివరణ కోరింది.

04/12/2019 - 23:02

ధన్వాడ, ఏప్రిల్ 12: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేర్ గ్రామంలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద గ్రామంలోని మట్టి దిబ్బలు మీద పడిన 10మంది ఉపాధికూలీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, కేవీ చంద్రశేఖర్‌రావు అధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఉపాధికూలీలు మృతి చెందిన సంఘటనను ఆయన పరిశీలించారు.

04/12/2019 - 23:01

హైదరాబాద్, ఏప్రిల్ 12: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రాథమిక హక్కులపై ప్రజా చైతన్య సదస్సును ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్టు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి చెప్పారు.

04/12/2019 - 23:00

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న నగదు దాదాపు రూ. 77 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలీసులకు రూ 42 కోట్లు పట్టుబడగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.27 కోట్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు వివరించారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 20 లక్షల లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నారు.

04/12/2019 - 22:38

హైదరాబాద్, ఏప్రిల్ 12: సుప్రీంకోర్టులో సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టులోనూ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు విధుల విభజన జరిగింది. హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ నేతృత్వంలో ఒక డివిజన్ బెంచ్‌ను, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ , జస్టిస్ పీ కేశవరావుల నేతృత్వంలోని మరో డివిజన్ బెంచ్‌ను ఏర్పాటు చేశారు.

04/12/2019 - 21:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి వివరాలు, ఎవరు ఇచ్చిందీ దాతల పేర్లు సీల్డ్ కవర్లో ఉంచి తమకు అందజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 30 నాటికి ఎన్నికల కమిషన్‌కు వివరాలు ఇవ్వాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పార్టీలకు అందజేసిన విరాళాలపై పారదర్శకత కోసం సుప్రీం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది.

04/12/2019 - 21:28

అమృత్‌సర్, ఏప్రిల్ 12: జలియన్‌వాలాబాగ్ నరమేథంపై బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందేనని, కేవలం విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, ఆ ఘాతుకంలో మరణించినవారి వారసులు డిమాండ్ చేశారు. మానవ చరిత్రలో పెను మచ్చగా మిగిలిపోయిన జలియన్‌వాలా బాగ్ నరమేధం అమృత్‌సర్‌లో జరిగి శనివారానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

04/12/2019 - 21:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ను విడుదల చేయకూడదంటూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 15న విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి గోగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ నెల 15న బయోపిక్ నిర్మాతల వాదనలు వింటామని స్పష్టం చేసింది.

04/12/2019 - 21:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ‘పశ్చిమ బెంగాల్‌ను చూస్తుంటే తీవ్ర ఆందోళనకర పరిణామం ఏదో జరుగుతున్నట్టు కన్పిస్తోంది’ అని సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర పరిస్థితులపై వ్యాఖ్యానించింది.

04/12/2019 - 21:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును 2013లోనే మూసివేసినట్టు సుప్రీం కోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. తండ్రీకొడులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రాధమిక విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి దర్యాప్తు సంస్థ శుక్రవారం వౌఖికంగా తెలిపింది.

Pages