S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/10/2019 - 22:52

జడ్చర్ల, ఏప్రిల్ 10: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని విజయ నర్సింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతూ, పట్టణంలోని ఓ మెడికల్ షాపులో జీవనోపాధి పొందుతున్న భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మాధవి (23) అనే యువతి హాస్టల్ వెనుక భాగంలోగల రైలు పట్టాలపై విగతజీవిగా బుధవారం ఉదయం కనిపించింది.

04/10/2019 - 22:29

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతు బీజేపీ నేతలపై న్యాయపరమైన విచారణ చేసి క్రిమినల్ కేసులు నమో దు చేయాలని కోరుతూ సికింద్రాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఎన్నికల ఏజెంట్ గుర్రం పవన్‌కుమార్ గౌడ్, హైకోర్టు న్యాయవాది ఎంఏ ముఖీద్‌లు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు 7799 నెంబర్ కేటాయించారు.

04/10/2019 - 22:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. దాణా కేసులో జైలుకెళ్లిన లాలూకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. లాలూ పిటిషన్‌కు బెంచ్ కొట్టేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం లాలూ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది.

04/10/2019 - 22:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై ఢిల్లీ హైకోర్టు పరువునష్టం అభియోగం దాఖలు చేసింది. కేంద్ర మాజీ మంత్రి ఎం.జే.అక్బర్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. అక్బర్ 20 ఏళ్ల క్రితం జర్నలిస్టుగా ఉన్న సమయంలో తన పట్ల లైంగికంగా అమర్యాదకరంగా ప్రవర్తించినట్టు ఆమె గత ఏడాది మీడియా ద్వారా ఆరోపణలు చేశారు.

04/10/2019 - 05:56

గోదావరిఖని; రెండు దశాబ్దాలుగా అడ్డు అదుపు లేకుండా తెలంగాణ, మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాలను అడ్డా చేసుకుంటూ అక్రమ కలప దందా సాగిస్తున్న తెలంగాణ వీరప్పన్‌గా పిలువబడే మోస్ట్ వాంటెడ్ ఎడ్ల శ్రీను అలియస్ పోతారం శ్రీను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

04/10/2019 - 01:04

సైదాబాద్, ఏప్రిల్ 9: రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం షిరిడీ వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉంచిన నగదు, బంగారం చోరీకి గురయ్యాయి. మలక్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూసారంబాగ్‌లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి బాదె సురేష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం షిరిడీ వెళ్లారు.

04/10/2019 - 01:03

వికారాబాద్, ఏప్రిల్ 9: పోలీసుల తనిఖీల్లో రూ.కోటిన్నర పట్టుకున్న సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఓటి సిబ్బంది, స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఏపీ09బీ ఏ0045 నెంబరు కారులో రూ.1.50 కోట్లు తీసుకెళ్తున్నారు.

04/09/2019 - 22:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దాణాకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొదని సుప్రీం కోర్టులో సీబీఐ వాదించింది. తీవ్రమైన అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్నందున బెయిల్ మంజూరు చేయొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది.

04/09/2019 - 22:12

కడప,ఏప్రిల్ 9: జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సాధారణ ఎన్నికలు సంబంధించి ఎన్నికలకోడ్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నికల నిఘాలో అధికారులు తనిఖీలు చేసే క్రమంలో రూ.4.27కోట్ల నగదును, బంగారు, చీరలు, రోల్డ్‌గోల్డ్ నగలకు సంబంధించి రూ.4కోట్లు విలువచేసే వస్తువులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ ప్రకటించారు.

04/09/2019 - 22:01

గజపతినగరం, ఏప్రిల్ 9: వివిధ గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలతో పాటు ముగ్గురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని గజపతినగరం ట్రైనీ ఎస్.ఐ రాజేష్ తెలిపారు.

Pages