S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/09/2019 - 21:50

ఇచ్ఛాపురం(రూరల్), ఏప్రిల్ 9: బహదానదిలో గుర్తు తెలియని వ్యిక్తి మృతదేహం లభ్యమైంది. బహుదానది వంతెన కింద 30 నుంచి 35 సంవత్సరాలు వయస్సుగల వ్యక్తి మృతి చెందాడాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసును నమోదు చేసినట్లు రూరల్ ఎస్ ఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
60 మద్యంబాటిల్స్ స్వాధీనం

04/09/2019 - 06:11

ఇల్లందకుంట, ఏప్రిల్ 8: ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని జమా బందీ చేసేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన ఓ తహశీల్దార్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. బాధిత రైతు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

04/09/2019 - 05:51

పుంగనూరు, ఏప్రిల్ 8: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్ పేటలో నివాసం ఉంటున్న టీడీపీ నాయకుడు సుబ్రమణ్యంరాజు ఇంట్లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.74లక్షల నగదు సీజ్ చేసినట్లు ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ చౌక దుకాణం నిర్వహిస్తున్న సుబ్రమణ్యం రాజు ఇంట్లో నగదు ఉన్నట్లు తమకు ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించామని తెలిపారు.

04/09/2019 - 05:47

తిరుపతి, ఏప్రిల్ 8: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఉత్సవ మూర్తులకు సంబంధించిన దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే మూడు బంగారు కిరీటాలను చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. స్వామివారి కిరీటాలను చోరీ చేసిన వ్యక్తి మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోడేగా గుర్తించారు. ఇతనిని దాదర్ రైల్వేస్టేషన్లో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

04/09/2019 - 05:26

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. సోమవారం నాడు హైదరాబాద్ నారాయణగూడ టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీలో 8 కోట్ల రూపాయల నగదు దొరికింది. పట్టుబడిన నగదు భారతీయ జనతా పార్టీకి చెందిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ జారీ చేసిన సెల్ఫ్ చెక్ ద్వారా బ్యాంక్ లో డ్రా చేశారన్నారు.

04/09/2019 - 05:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో ఆలయాలు, మత సంబంధ ప్రదేశాల్లో సౌకర్యాల లేమిపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ అధికారుల పెత్తనమేనిటని కోర్టు నిలదీసింది. పూరీలోని జగన్నాథ్ ఆలయంలో భక్తులపై జరుగుతున్న వేధింపులపై న్యాయస్థానం తీవ్రంగానే స్పందించింది.

04/09/2019 - 05:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సూత్రధారి, కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్ కుమారేనని సీబీఐ సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. వందలాది మంది నరమేధానికి దారితీసిన ఆ ఊచకోత ఘటనకు కింగ్‌పిన్‌గా ఉన్న సజ్జన్‌కుమార్‌కు బెయిలు ఇవ్వడానికి వీలులేదని సుప్రీంకు నివేదించింది.

04/09/2019 - 04:48

న్యూఢిల్లీ: ఓటర్లలో మరింత నమ్మకాన్ని కలుగజేయడానికి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కిస్తున్న ఒక వీవీ ప్యాట్‌కు బదులుగా ఐదు వీవీ ప్యాట్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

04/09/2019 - 01:24

రాజేంద్రనగర్, ఏప్రిల్ 8: అనుమానస్పద స్థితిలో తీవ్ర గాయాలతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ గ్రామం గండిపేట మండలానికి చెందిన కుమార్ కుమారుడు తరుణ్(19). ఇతను స్థానికంగా తాగుడుగు బానిసై, ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. గత 6వ తేదీన రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు ఉందని వెళ్లి 7వ తేదీ తెల్లవారు ఝాము వరకు రాలేదు.

04/09/2019 - 01:24

రాజేంద్రనగర్, ఏప్రిల్ 8: లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ గగన్‌పహాడ్ శానిటేషన్ అధికారి పట్టుబడ్డ సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ జీహెచ్ ఎంసీ సర్కిల్ కార్యాలయం పరిధిలో పని చేస్తున్న గగన్‌పహాడ్ శానిటేషన్ ఇన్‌చార్జ్‌గా జగదీష్ పని చేస్తున్నాడు.

Pages