S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/16/2018 - 04:34

సీలేరు, జూలై 15: ఆంధ్రా- ఒడిశా మీదుగా కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే 1,060 కిలోల గంజాయిని ఆదివారం తెల్లవారు జామున ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. రవాణాకు ఉపయోగించిన కంటైనర్‌తోపాటు హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

07/16/2018 - 01:59

రేణిగుంట, జూలై 15: ఎర్రచందనం స్మగ్లర్ హాజీవలి పోలీసుల విచారణలో ఉండగా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై డీఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు విచారణ చేపట్టారు. ఆదివారం చిత్తూరు జిల్లా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటలసేపు విచారణ చేశారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.

07/16/2018 - 01:51

హైదరాబాద్/ కేపీహెచ్‌బీకాలనీ, జూలై 15 : సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ కూరగాయల విక్రయం ముసుగులో అధిక సంపాదనకు ఆశపడి గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/16/2018 - 01:37

కోదాడ: సూర్యాపేట శివారులోని దండుమైసమ్మ దేవాలయం వద్ద మొక్కు తీర్చుకొని తిరిగి వెళ్తున్న ట్రాలీ ఆటో 65వ నెంబరు జాతీయ రహదారి కోదాడ బైపాస్‌లో ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

07/16/2018 - 01:15

హైదరాబాద్, జూలై 15: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్సెట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఇద్దరినీ లోతుగా విచారిస్తోంది. నాలుగు రోజులపాటు కోర్టు అనుమతితో నిందితులు వాసుబాబు, శివనారాయణను సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుల కస్టడీ గడువు సోమవారం సాయంత్రంతో పూర్తవుతుంది.

07/16/2018 - 00:32

హజారీబాగ్ (జార్ఖండ్), జూలై 15: సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేక కొందరు, మతాచారాల పేరుతో మరికొందరు, సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో ఇంకొందరు.. కారణాలు ఏవైనా, ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూడడం, తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం, చివరికి ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్న పెడధోరణులకు అద్దం పడుతుంది.

07/16/2018 - 01:53

చౌడేపల్లె: అసభ్యంగా మాట్లాడవద్దని యూనిఫారం లేని ఎస్‌ఐకి ఓ యువకుడు హితవుపలికాడు. నేనెవరో నీకు తెలుసా.. అంటూ ఎస్‌ఐ ప్రతిఘటించారు. అతనిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ఎస్‌ఐ, స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఎఆర్ కానిస్టేబుళ్లచే తీవ్రంగా చితకబాదాడు.

07/15/2018 - 23:55

సోమల, జూలై 15: చేసిన తప్పును సరిదిద్ధుకోవాలని చెప్పిన భర్తను అడ్డుతొలగించేందుకు ఏకంగా భర్తను హతమార్చిన సంఘటన చిత్తూరుజిల్లా సోమల మండలంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని పుంగనూరు రూరల్ సిఐ సాయినాధ్, సదుం ఎస్‌ఐ నాగరాజులు పరిశీలించారు. వారి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి...

07/15/2018 - 23:51

రేణిగుంట, జూలై 15: మండల పరిధిలోని కృష్ణాపురం వద్ద వాహనంతో పాటు 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. టాస్క్ఫోర్స్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి కృష్ణాపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.

07/15/2018 - 22:52

లేపాక్షి, జూలై 15 : మండల పరిధిలోని గోపిందేవరపల్లిలో ఆదివారం ఉదయం ఆరో తరగతి చదువుతున్న నాగేష్ (11) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు భోజనాలు ముగించుకుని ఇంటి ముందు కూర్చొని ఉండగా నాగేష్ ఇంట్లో ఉరి వేసుకొన్నాడు. నాగేష్ తమ్ముడు పది నిముషాల తర్వాత ఇంట్లోకి వెళ్లగా ఉరేసుకుని తన అన్నను చూసి గట్టిగా కేకలు వేశాడు.

Pages