S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/05/2019 - 21:13

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఎన్నికల బాండ్స్ పథకంపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషన్ వేసిన ఎన్జీవోను ఆదేశించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ అవసరమని పేర్కొంటూ, దానిని ఈనెల 10న చేపడతామని కేసు విచారణను వాయిదా వేసింది.

04/05/2019 - 21:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఇటీవల జారీ అయిన ఆధార్ ఆర్డినెన్స్ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లను హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరి అప్పీళ్లను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోనే తమ అభ్యంతరాలను వెల్లడించాలని కోరింది.

04/05/2019 - 04:43

నెల్లూరు, ఏప్రిల్ 5: గత 20 ఏళ్లుగా రైళ్లలో నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్తుణ్ని నెల్లూరు ప్రభుత్వ రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుంతకల్లు రైల్వే ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ వెల్లడించిన సమాచారం మేరకు..

04/05/2019 - 04:35

ఘట్‌కేసర్, ఏప్రిల్ 4: వేర్వేరు సంఘటనలో ఇంటి తాళాలు పగులగొట్టి నగలు, నగదును చోరీ చేసిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి చౌదరిగూడ, యంనంపేట్ గ్రామాలలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... చౌదరిగూడ పంచాయతీ సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న కొత్తపల్లి రాజు గత నెల 29న తన మరదలు వివాహం ఉండటంతో కేసవముద్రం వెళ్లినట్లు తెలిపారు.

04/05/2019 - 04:35

రాజేంద్రనగర్, ఏప్రిల్ 4: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ పంచాయతీ సెక్రటరీ పట్టుబడ్డాడు. సంఘటన రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విజయా బ్యాంక్ వద్ద చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం గండిపేట మండల పరిధిలోని పుప్పాలగూడ గ్రామ పంచాయ తీ కార్యదర్శి వెంకట శివయ్య. మణికొండ గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నా డు.

04/05/2019 - 04:35

మోమిన్‌పేట, ఏప్రిల్ 4: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శిరషా రాఘవేందర్ తెలిపారు. గురువారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 2న నర్సాపూర్ తండాకు చెందిన ఝుంకీబాయితో హరియాతోపాటు మరికొందరు గొడవపడ్డాడు. ఆవేశంతో ఝుంకీబాయిని గొడ్డలితో నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది.

04/04/2019 - 23:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇసుక అక్రమ తవ్వకాలను అదుపు చేయటంలో విఫలమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ వంద కోట్ల జరిమానా విధించింది. ఈ వంద కోట్లను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ గురువారం ఆదేశించింది. పర్యావరణ అనుమతులేవీ తీసుకోకుండానే రాష్ట్రంలో కొనసాగిస్తున్న ఇసుక తవ్వకాలను వెంటనే ఆపాలని కూడా ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

04/04/2019 - 23:17

హైదరాబాద్/గచ్చిబౌలి, ఏప్రిల్ 4: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో మాదాపూర్ పోలీసులు పట్టుకున్న రెండు కోట్ల రూపాయల నగదు జయభేరి ప్రాపర్టీస్ సంస్థకు చెందినదేనని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

04/04/2019 - 05:20

హైదరాబాద్, ఏప్రిల్ 3: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉద్రిక్తతలను రేపుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖరరెడ్డిని కించపరిచే ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోలు గొడవకు కారణమయ్యాయి.

04/04/2019 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులపై డీజీపీ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో ఇబ్రహీంపట్నం ఎసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్, రాయదుర్గం సీఐ రాంబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

Pages