S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/31/2019 - 05:31

హైదరాబాద్, మార్చి 30: అనుమతి లేని నకిలీ పత్తివిత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీటీ-2 (బీజీ-2) పత్తి విత్తనాలపేరుతో హెచ్‌టీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

03/31/2019 - 04:41

ఎ కొండూరు, మార్చి 30: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్య చేసిన వైనం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా దార్ల మండలం గుంపెళ్ళ గ్రామానికి చెందిన మొటం ఎల్లయ్య, వీరమ్మల కుమార్తె పేర్ల భూలక్ష్మి అలియాస్ లక్ష్మి (35)కి అదే గ్రామానికి చెందిన పేర్ల సంజీవతో 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. పదేళ్ళ పాటు వీర కాపురం సజావుగానే సాగింది.

03/31/2019 - 04:23

రాజేంద్రనగర్, మార్చి 30: ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇళ్లు చోరీకి గురైన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఆదర్షాహిల్స్‌కాలనీలో నివసిస్తున్న నరేందర్ గచ్చిబౌలీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన భార్య పరిగి వద్ద గల మనె్నగూడలోని నరేందర్ అత్తగారి ఇంటికి వెళ్లింది.

03/31/2019 - 04:23

మేడ్చల్, మార్చి 30: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ కథనం ప్రకారం... పట్టణంలో నివాసం ఉంటున్న గన్నవరపు వీరాంజనేయులు(47) మేడ్చల్‌లోని యూఎస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.

03/31/2019 - 01:52

ఇండోర్:ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో అమలు అయ్యేవెన్ని..కాలగర్భంలో కలిసిపోయేవెన్నో తెలియక పోయినా..వీటిని ఓటర్లు మాత్రం గట్టిగా నమ్ముతున్నారని చెప్పడానికి ఉదాహరణలెన్నో..! ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలే కాదు..ప్రాంతీయ పార్టీలు ఇబ్బడి ముబ్బడిగానే వాగ్దానాలు గుప్పిస్తున్నాయి.

03/30/2019 - 00:35

షాద్‌నగర్ రూరల్, మార్చి 29: మహిళ సజీవ దహనం హత్య కేసును పోలీసులు చేదించారు. శుక్రవారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఏసీపీ సురేందర్ వెల్లడించారు.

03/30/2019 - 00:33

రాజేంద్రనగర్, మార్చి 29: ఇంటి అద్దె అడిగాడని యజమానిపై కత్తితో యువకుడు దాడి చేసి హత్యయత్నానికి పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హసన్‌నగర్‌లో నివసిస్తున్న అబ్దుల్ రషీద్ నివసిస్తున్నాడు. అబ్దుల్ రషీద్ తన నివాసంలో తజాముల్‌కు ఓ పోర్షన్‌ను అద్దెకు ఇచ్చాడు. తజాముల్‌ను అద్దె ఇవ్వాలని అబ్ధుల్ రషీద్ అడగడంతో కోపోద్రిక్తుడైన దాడి చేశాడు.

03/29/2019 - 23:59

శ్రీకాకుళం, మార్చి 29: ఎన్నికల నిర్వహణ కోసం కొంతమంది అక్రమ మద్యాన్ని ఏవోబీలో నిల్వ చేసి, అక్కడ నుంచి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు సరఫరా చేసే ముఠాలను అదుపుచేసేందుకు ఈ రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

03/29/2019 - 23:12

న్యూఢిల్లీ, మార్చి 29: ప్రస్తుతం అనుసరిస్తున్న వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించే పద్ధతి అత్యంత అనుకూలమయిందని ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాండమ్‌గా ఒక్కో పోలింగ్ కేంద్రానికి చెందిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తున్న ప్రస్తుత విధానం సరయిందని ఎన్నికల సంఘం సమర్థించుకుంది.

03/29/2019 - 23:00

తిరుపతి, మార్చి 29: తిరుమల శేషాచల అడువుల్లో శుక్రవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది విఫలయత్నం చేస్తున్నారు. శుక్రవారం తిరుమల ధర్మగిరి ప్రాంతంలోని గాడికోన వద్ద పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నారు.

Pages