S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/18/2019 - 22:23

పోలాకి, ఫిభ్రవరి 18: మండలంలోగల రాళ్లపాడు పంచాయతీ ముప్పిడి గ్రామానికి చెందిన దేశెల్ల శాంతరావు2013లో చిట్టి సుందరమ్మపై పోలాకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగం జరిగిందని ఎస్సై టి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటినుండి నరసన్నపేటలో గల కోర్టులో వాయిదాలు నడుస్తుండేవని ఆయన తెలిపారు.

02/18/2019 - 22:10

రావులపాలెం, ఫిబ్రవరి 19: ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును రావులపాలెం పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఈతకోట వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం చెక్‌పోస్టు వద్ద ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు.

02/18/2019 - 22:03

ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 18: డిజిటల్ ఈ-పాస్ పుస్తకం కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఒక రైతును డిమాండ్ చేసిన వీఆర్వో సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని సిహెచ్ పోతేపల్లి ఇన్‌చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న పి సుబ్రహ్మణ్యం ఒక రైతు కుమారుడు రాయపాటి లీలా కృష్ణమూర్తి నుండి నాలుగువేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నిన వలకు చిక్కాడు.

02/18/2019 - 05:01

రామాయంపేట, ఫిబ్రవరి 17: ఇంట్లో కుటుంబీకులు తమ పెళ్లిని అంగీకరించరనే మనోవేదనతో ఓ ప్రేమ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సం ఘటన ఆదివారం ఉదయం తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాన్సీలింగాపూర్‌కు చెందిన నల్లబాలు (21), రాయిలాపూర్‌కు చెందిన పర్వీన్ (18) గత కొద్ది రోజులుగా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.

02/18/2019 - 04:39

హైదరాబాద్, పిబ్రవరి 17: ప్రవాస భారతీయుడు చిగురిపాటి జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అక్రమ భూ దందాలపై పోలీస్ అధికారులు దృష్టి పెట్టారు. పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలను రాకేష్‌రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని రౌడీ షీటర్స్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, సినిమా నటులతో భూ దందాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయ్యింది.

02/18/2019 - 02:00

విజయవాడ, ఫిబ్రవరి 17: గృహహింస నిరోధానికి చట్టం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. చట్టం ఉన్న విషయం చాలామంది మహిళలకు తెలియపోవడం, వారి హక్కులపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మహిళలకు గృహహింసకు గురవుతూనే ఉన్నారు. పనిచేసే ప్రదేశాల్లో దాదాపు 12రకాల వేధింపులకు సంబంధించి కేసు దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ దానిపై మహిళల్లో అవగాహన కొరవడింది.

02/18/2019 - 01:46

వెంకటాచలం, ఫిబ్రవరి 17: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కనుపూరు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు రూరల్ మండలం బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్ (19), షేక్ ఫయాజ్ (17), షేక్ షాన్‌వాజ్ (16) వరుసకు సోదరులు అవుతారు.

02/18/2019 - 01:32

శామీర్‌పేట, ఫిబ్రవరి 17: కూలి పనికి వెళుతున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

02/18/2019 - 01:32

జీడిమెట్ల, ఫిబ్రవరి 17: దేవరయాంజాల్‌లో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదంతో ఓ వ్యక్తి గన్‌తో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొంపల్లి గ్రామంలోని జీఎల్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే పిసారి నర్సింహా రెడ్డి (60) వ్యవసాయం చేస్తుంటాడు.

02/17/2019 - 05:37

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఎన్నారై, పారిశ్రామిక వేత్త చిగురిపాటి జయరాం హత్య కేసులో ఇక పోలీస్ అధికారులను విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో సంబంధాలు ఉన్న ఎసీపీ( ఇబ్రహీంపట్నం), నల్లకుంట సీఐ శ్రీనివాస్, రాయదుర్గం సీఐ రాంబాబులపై బదిలీ వేటు పడింది. జయరాం హత్య తర్వాత నిందితుడు రాకేష్‌రెడ్డి దాదాపు 11మంది పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

Pages