S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/30/2019 - 01:18

న్యూఢిల్లీ, జనవరి 29: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు చార్జీషీటు నుంచి జెరుసలేం మత్తయ్య పేరును ఉమ్మడి హైకోర్టు తొలగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు మంగళవారం విచారణకు వచ్చింది.

01/29/2019 - 05:07

వరంగల్, జనవరి 28: వరంగల్ అర్బన్ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా (పీఎల్‌ఐ) అధికారి పల్లకొండ యాదగిరిని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం జిల్లా కోర్టు క్యాంటీన్‌లోనే ఈ వ్యవహారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ కే. భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2011 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ సమ్మయ్య 2018 సెప్టెంబర్‌లో మృతిచెందారు.

01/29/2019 - 04:24

విజయవాడ (క్రైం), జనవరి 28: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. ఘటన జరిగినప్పుడు అప్పటి దర్యాప్తు అధికారులతోపాటు పలువురు పోలీసులను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ చేపట్టిన సిబిఐ పలువురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

01/29/2019 - 04:00

న్యూఢిల్లీ, జనవరి 28: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో ఊరట లభించింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణం కేసుకు సంబంధించి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తిని అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఫిబ్రవరి 18 వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ కోర్టు సోమవారం ప్రకటించింది.

01/29/2019 - 01:30

కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 28: దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి బంగారు అభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు.

01/29/2019 - 01:27

గచ్చిబౌలి, జనవరి 28: ఇంటికి తాళం వేసి కనపడితే ఆ ఇల్లు గుల్ల కావలసిందే. పగలు చూస్తాడు రాత్రి పని కానిచ్చేస్తాడు. తెలంగాణలో 47, ఏపీలో 16 దొంగతనాలు చేసిన ఘరానా గజదొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

01/29/2019 - 01:23

నేరేడ్‌మెట్, జనవరి 28: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు కరెంటు షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మన్‌మోహన్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం మునిమాముల గ్రామానికి చెందిన ఎస్.

01/29/2019 - 01:22

కీసర: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన గోధుమకుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం గోధుమకుంట గ్రామానికి చెందిన రేగు జంగయ్య (35) సోమవారం ఉదయానే్న టిప్పర్ లారీలో మట్టిని తీసుకువచ్చి ప్లాటు స్థలంలో పోస్తున్నాడు. టిప్పర్ పైభాగాన ఉన్న విద్యుత్ తీగలు టిప్పర్‌ను తాకడంతో ఉన్నట్టుండి విద్యుత్ షాక్ తగిలింది.

01/29/2019 - 00:14

న్యూఢిల్లీ, జనవరి 28: తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఏడు ముంపు మండలాల్లో నియోజకవర్గాల పునిర్విభజన జరగకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ శశిధర్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా..

01/28/2019 - 03:51

తుంగతుర్తి, జనవరి 27: పోలీసుల కృషి ఫలితంగా కలకలం సృష్టించిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సంఘటన జరిగిన 24గంటల లోపే మిస్టరీని ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకొని సర్కిల్ పోలీసులు రికార్డు సృష్టించారు. కిడ్నాపర్‌ల చెర నుంచి బాలికను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Pages