S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/27/2019 - 01:35

మేడ్చల్, జనవరి 26: ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌లారీ ఢీకొన్న సంఘటనలో వ్యక్తితో పాటు బాలుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గ్రాయాలైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

01/27/2019 - 01:33

ఉప్పల్, జనవరి 26: విద్యుదాఘాతంతో విద్యుత్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ హనుమ సాయినగర్‌లో నివసిస్తున్న ఉప్పరి భూపాల్ (37) తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

01/27/2019 - 01:30

ఘట్‌కేసర్, జనవరి 26: అనుమానస్పద స్థితిలో మహిళ, మరో యువకుడు ఒకే చీరతో జంటగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని అల్వాల్‌కు చెందిన మున్న మల్లేష్, సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలే పార్వతి(40) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

01/27/2019 - 05:00

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ చోపర్ కేసులో నిందితుడైన న్యాయవాది గౌతమ్ ఖైతాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లధనం కలిగి ఉన్నారనే ఆరోపణపై అరెస్టు చేసి కోర్టు అనుమతితో రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నట్లు ఈడీ పోలీసులు చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో గౌతమ్ ఖైతాన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు.

01/26/2019 - 01:45

హనుమాన్‌జంక్షన్, జనవరి 25: బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతున్న ఇన్నోవా అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు తెలిపిన వివరాల ప్రకారం.

01/26/2019 - 01:34

విజయవాడ (క్రైం), జనవరి 25: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

01/26/2019 - 01:25

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర వేడుకల నిర్వహణకు రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. రెప్పవాల్చని నిఘాతో అణువణువును పరిశీలిస్తూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను భగ్నం చేయడానికి ప్రణాళిక వేసినట్టు అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు వెల్లడించడంతో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. నగరమంతటా 25వేల మంది భద్రతా సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో నియమించారు.

01/26/2019 - 01:20

హైదరాబాద్ (గచ్చిబౌలి), జనవరి 25: భారత్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను నట్టేట ముంచేసిందో సంస్థ. ఏకంగా నకిలీ ఇంటర్వ్యూల జరిపి అందినంత దండుకున్నారు. స్వదేశంలోనే కాదు, అరబ్ దేశాల యువకులూ మోసపోయారు. లక్షా నాలుగు వేల మంది నిరుద్యోగుల నుంచి 74 కోట్ల రూపాయలు వసూలు చేసిన నకిలీ జాబ్ ఫ్రాడ్ సంస్థకు చెందిన 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

01/26/2019 - 01:18

హైదరాబాద్(జీడిమెట్ల), జనవరి 25: అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. పసికందు అని కూడా చూడకుండా చెట్ల పొదల్లోకి ఎత్తుకువెళ్లి పాపపై పైశాచికత్వాన్ని ప్రదర్శించిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కైసర్‌నగర్‌లో చోటుచేసుకుంది. గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్‌లో నివాసముండే మొయినుద్దీన్ (33) ఆటో డ్రైవర్.

01/26/2019 - 00:09

న్యూఢిల్లీ, జనవరి 25: అయోధ్య రామజన్మభూమి వివాదం కేసును విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. ఈ కేసును ఈ నెల 29వ తేదీ నుంచి ధర్మాసనం విచారిస్తుందని పేర్కొన్నారు.

Pages