S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/25/2019 - 23:52

న్యూఢిల్లీ, జనవరి 25: అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

01/25/2019 - 23:37

న్యూఢిల్లీ, జనవరి 25: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను విచారించాల్సి ఉన్నందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును కోరాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ముం దస్తు బెయిల్ పిటిషన్ విచారిస్తున్న న్యాయమూర్తి ఎదుట సీబీఐ,ఈడీ తమ వాదన వినిపించాయి.

01/25/2019 - 23:30

రాయగఢ్ (మహారాష్ట్ర), జనవరి 25: ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన బంగ్లాను అక్రమమైనదని ప్రభుత్వం తేల్చడంతో, ఆ భవనాన్ని అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ భవనం సముద్ర తీరంలో నీరవ్‌మోదీ నిర్మించారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నేరగాడు ఈ భవనాన్ని నిర్మించారు. ఈ వివరాలను కలెక్టర్ సూర్యవంశి తెలిపారు.

01/25/2019 - 23:22

గుడిహత్నూర్, జనవరి 25: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూరు తాండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీచేసి ఓటమిపాలైన పవార్ కళాబాయి ఓటమి భారంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టగా ఉత్కంఠభరితంగా సాగిన లెక్కింపులో కళాబాయి ఓటమి పాలయ్యారు.

01/25/2019 - 23:21

భూపాలపల్లి, జనవరి 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కరపత్రాలు వెలిశాయ. పంగిడిపల్లి, పెద్దంపల్లి, రామకృష్ణాపురం (వి), వెలిశాల గ్రామాలలో కరపత్రాలు కలకలం రేపాయి. మావోయిస్టుల పేరున లభ్యమైన కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

01/25/2019 - 23:20

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 25: జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పద్మావతీ కాలనీ ప్రధాన రహదారిపై గల ఒక టీ కొట్టులో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలు కాగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ప్రధాన రహదారిపై చెత్తను ఊడుస్తూ సేకరించిన చెత్తను తగబెడుతుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి టీకొట్టు డబ్బాపై పడడంతో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి.

01/25/2019 - 22:50

లింగపాలెం, జనవరి 25: కొంత కాలం క్రితం వరకూ తన పై అధికారిగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపీడీవో)కి సంబంధించిన బిల్లులు మంజూరుకు లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

01/25/2019 - 22:36

వెంకటగిరి, జనవరి 25 : సమాజం ఆధునిక యుగంలో దూసుకుపోతుంటే కొంతమంది మాత్రం భూతవైద్యాన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి బతికి వస్తాడని భూతవైద్యులు చెప్పడంతో లక్షలు ఖర్చుచేయడానికి సిద్ధపడ్డారు.

01/25/2019 - 22:25

చందుర్తి, జనవరి 25: వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడడంతో చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మారుపాక దేవయ్య (55), ఇల్లంతకుంట వెంకటస్వామి (55) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింగాపూర్‌కు చెందిన టిఎస్.02.యుఎ.8461 అనే ఆటోలో వేములవాడ నుండి నర్సింగాపూర్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కుక్కన తప్పించబోగా ఆటో బోల్తాపడింది.

01/25/2019 - 21:41

బచ్చన్నపేట, జనవరి 25: రెండు ద్విచక్రవాహాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని చిన్నరామచర్ల గ్రామంవద్ద జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నరామచర్ల గ్రామానికి చెందిన జనె్న హరిష్(24) కొన్నాళుగా ఆటోనడుపుకొంటూ హైదరాబాద్‌లో జీవిస్తున్నాడు. చిన్నరామచర్ల స్వగృహంలో జరిగిన ఓ విందు కార్యాక్రమానికి భార్యతో కలిసి వచ్చాడు.

Pages