S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/22/2019 - 22:39

చిత్తూరు, జనవరి 22: ఆధునిక సమాజంలో టెక్నాలజీ వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో పిల్లల పెంపకంలో సరైన పర్యవేక్షణ లేకపోతే ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటన దర్పణం పడుతుంది. చిన్నారులు ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్టు చేసిన వ్యవహారం చిత్తూరు నగరంలో పెద్ద దుమారమే లేపింది.

01/22/2019 - 22:39

క్పుపం, జనవరి 22: ప్రేమించిన వ్యక్తి మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుడుపల్లి మండలం, కంచుబందార్లపల్లిలో మంగళవారం జరిగింది.

01/22/2019 - 22:37

తిరుపతి, జనవరి 22: తిరుపతి పోలీస్ శాఖలో ఒక విభాగమైన రక్షక విభాగం సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇద్దరు పాత నేరస్తులు పట్టుబడ్డారు. రక్షక ఇన్‌చార్జ్ ఏఎస్‌ఐ సి.గోపాల్‌రెడ్డి, కానిస్టేబుల్ ఎన్.అభినందన్ రెడ్డి, ఎ.లోకేష్‌కుమార్ రెడ్డి, వెంకటరెడ్డిలు ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

01/22/2019 - 22:36

తిరుపతి, జనవరి 22: తిరుపతి రైల్వేస్టేషన్‌లోని 4వ నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద తమిళనాడుకు చెందిన కె.సురేంద్రన్ (25)ను రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ ఎ.ఆశీర్వాదం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 1.60 లక్షలు విలువ చేసే 2వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

01/22/2019 - 22:36

నగరి, జనవరి 22: కాలి నడకన వెళుతున్న లలిత (32) అనే మహిళను వ్యాన్‌తో ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన డ్రైవర్ మణిగండన్‌కు జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి రెండు సంవత్సరాలు జైలు, రూ. 10వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. వ్యాను యజమానికి మూడు నెలలు జైలు, రూ. 1000 జరిమానా విధించారు. సీఐ మల్లికార్జున రావు కధనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

01/22/2019 - 22:35

శ్రీకాళహస్తి, జనవరి 22: శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన ఏడుగురు ఓ ప్రముఖ దినపత్రికలోని ప్రకటనలు చూసి నగదు చెల్లించి మోసపోయామని మంగళవారం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మోసపోయిన వైనాన్ని పోలీసులకు వివరించి తాము కోల్పోయిన నగదును ఇప్పించాలని కోరారు.

01/22/2019 - 22:29

బద్వేలు, జనవరి 22: మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రెడ్డి, కార్మికుల మధ్య మంగళవారం వాగ్వివాదం చోటు చేసుకుంది. జీవో నెం.279 అమలులో భాగంగా బయోమెట్రిక్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ తేల్చిచెప్పడంతో వివాదం మొదలైంది. అర్బన్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కేసులు కూడా నమోదు చేసుకున్నారు.

01/22/2019 - 22:27

గుంతకల్లు, జనవరి 22 : గుంతకల్లు రైల్వేస్టేషన్‌లోని 4వ ప్లాట్‌ఫారంలో మంగళవారం రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మహారాష్టల్రోని డోండ్‌కు చెందిన ఆనంద్ కందారి (35) వాస్కోడిగామా-హౌరా వెళ్లే 18048 రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

01/22/2019 - 04:05

హైదరాబాద్, జనవరి 21: మాయమాటలు చెబుతూ జనాన్ని మోసం చేస్తున్న ఇరానీ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ‘సమీపంలోని గుడిలో పూజులు చేస్తున్నాం. బంగారం షాపు పెడుతున్నాం. షాపు పెడుతున్నప్పడు పేదలకు డబ్బులు దానం చేయాలి. అయితే మాకు సమయం లేదు.. మీరే పంచండి‘అని ముఠా జనానికి ఆశచూపుతుంది. వెయ్యి రూపాయలు ఆశచూపించి మాయ మాటలతో మహిళ దృష్టిమలచి బంగారు ఆభరణాలను గ్యాంగ్ ఎత్తుకెళ్తుంది.

01/22/2019 - 03:30

చిత్తూరు, జనవరి 21: కోళ్లను దొంగలించాడన్న అనుమానంతో వ్యక్తిని కాళ్లూ చేతులు కట్టి వేసి విచక్షణారహితంగా చితకబాదిన అమానుష సంఘటనకు సంబంధించిన వీడియో సోషిల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పెనుమూరు మండలం ఓబయ్యగారి పల్లికి చెందిన వేణుగోపాల్ చిత్తూరు నగరంలోని చికెన్ సెంటర్‌కు కోళ్లను సరఫరా చేసే వాహనానికి డ్రైవర్‌గా పని చేసేవాడు.

Pages