S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/31/2018 - 23:48

పిసిపల్లి, ఆగస్టు 31: మండలంలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించిన తనిఖీల్లో డ్రంక్ డ్రైవ్ కేసులో 12 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుచగా శుక్రవారం మూడు రోజులు జైలుశిక్ష విధించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవన్నారు.

08/31/2018 - 23:34

దాచేపల్లి, ఆగస్టు 31: దాచేపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావును అరెస్ట్‌చేసి అతని వద్ద నుండి భారిగా రు.4.90,000లు, ఆరు బియ్యం బస్తాలు, స్విఫ్ట్ డిజైర్ కారుని స్వాధీనం చేసుకున్నట్లు దాచేపల్లి ఎస్‌ఐ మహ్మద్ రఫీ శుక్రవారం తెలిపారు.

08/31/2018 - 23:04

లేపాక్షి, ఆగస్టు 31 : గుంటూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని గొంగటిపల్లి గ్రామానికి చెందిన నరసింహప్ప (35) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహప్ప తన లారీలో గుంటూరుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గురువారం తెల్లవారుఝామున రోడ్డు పక్కన తన లారీని ఆపి రోడ్డు అవతలి వైపునకు టీ తాగేందుకు వెళ్తున్న సమయంలో మరో వాహనం ఢీ కొంది.

08/31/2018 - 23:03

గుంతకల్లు, ఆగస్టు 31 : పట్టణంలోని కసాపురం రోడ్డు వంతెన సమీపంలో ఉన్న దుర్గమ్మ ఆలయం వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు జేఆర్పీ పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు 38 సంవత్సరాలు ఉండి, ఎర్రని చీర ధరించిందని తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

08/31/2018 - 22:52

చాగలమర్రి, ఆగస్టు 31: చాగలమర్రిలోని సుభాషిని రెడ్డి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాలుకు సమీపంలోని చాగలమ్మ వంకలో ఇద్దరు పిల్లలు ప్రమాద వశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. వివరాలిలా ఉన్నాయి.

08/31/2018 - 22:49

కోడుమూరు, ఆగస్టు 31:మండల పరిధిలోని గోరంట్ల గ్రామంలో శుక్రవారం రైతు బోయ రంగన్న(32) అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతు కుటుంబానికి ఈ ఏడాది నెలకొన్న కరవు పరిస్థితులతో సాగు చేసిన పంటలు చేతికి రాలేదు. దీంతో ఏటా పంటల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి.

08/31/2018 - 19:09

చండీఘర్‌ : గుర్గావ్‌లో ఆరవ తరగతి విద్యార్ధినిపై యూనివర్శిటీ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్న పైయుష్‌ అదే భవన సముదాయంలో నివసిస్తున్న బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

08/31/2018 - 01:08

పాయకాపురం, ఆగస్టు 30: తన భర్త కనిపించడం లేదంటూ భార్య ను న్న గ్రామీణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాధానగర్‌కు చెంది న మోతిక ఉషారాణికి కార్తీక్ వెంకటేష్‌కు వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో బీసెంట్‌రోడ్డులోని ఒక వస్త్ర దుకాణంలో గుమస్తా గా పనిచేస్తున్న కార్తిక్ వెంకటేష్ మ ద్యానికి బానిసై, కుటుంబాన్ని సక్రమం గా చూసుకోవడం లేదు.

08/31/2018 - 01:07

విజయవాడ (క్రైం), ఆగస్టు 30: అదనపుకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తపై నేరం రుజువుకావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.200ల జరిమానా విధిస్తూ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.

08/31/2018 - 01:03

రాజేంద్రనగర్, ఆగస్టు 30: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. దర్జాగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ప్రాంతానికి చెందిన నర్సింహ్మం మైలార్‌దేవ్‌పల్లిలో గత కొంత కాలంగా టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు.

Pages