S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/21/2018 - 22:49

నొయిడా, డిసెంబర్ 21: ఐటీ నగరం నొయిడాలో ఓ నకిలీ కాల్‌సెంట్‌ర్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 126 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. కాల్‌సెంటర్ నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అనుమానం వచ్చి గురువారం రాత్రి దాడులు నిర్వహించినట్టు సీనియర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ వెల్లడించారు. బోగస్ అమెరికా పౌరసత్వం కలిగిఉన్నట్టు తెలిపారు. నొయిడాలోని సెక్టార్ 63లో ఈ కాల్‌సెంటర్ నడుస్తోంది.

12/21/2018 - 22:42

ముంబయి, డిసెంబర్ 21: గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబయి సిబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సోహ్రాబుద్దీన్, భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి నకిలీ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పోలీసులు అభియోగం మోపారు.

12/21/2018 - 22:41

న్యూడిల్లీ, డిసెంబర్ 21: భార్య నైనా సహానీని దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని తందూరీ చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న యువజన కాంగ్రెస్ మాజీ నేత సుశీల్ కుమార్ శర్మకు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది.

12/21/2018 - 04:22

నిజామాబాద్, డిసెంబర్ 20: జిల్లాలో కేబుల్ ఆపరేటర్ల మధ్య వ్యాపారపరంగా నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే స్థానికంగా కేబుళ్లను నిర్వహిస్తున్న ఆపరేటర్లు పరస్పర దాడులు, కేబుల్ వైర్ల కత్తిరింపుల ద్వారా పైచేయిని చాటుకునే ప్రయత్నాలు కొనసాగించగా, ప్రస్తుతం ఏకంగా గోడౌన్లకు నిప్పంటించి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లేలా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

12/21/2018 - 04:17

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: నిషేధిత గుట్కాను రూపుమాపేందుకు విజిలెన్స్ జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. గురువారం వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి గోదాముల్లో నిల్వ చేసిన గుట్కా నిల్వలను భారీ ఎత్తున పట్టుకున్నారు. నిషేధిత గుట్కాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు జిల్లాలో గుట్కా వల్ల అనర్ధాలను తెలియజేసేందుకు వైద్యాధికారులతో అవగాహన కల్పిస్తున్నారు.

12/21/2018 - 03:22

పెనమలూరు, డిసెంబర్ 20: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదులపై పెనమలూరు సర్వేయర్ కొల్లి హరిబాబు ఇంటిలో ఏసీబీ అధికారుల సోదాలు బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాగాయి. గురువారం అతన్ని అరెస్టు చేసి గవర్నరుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోర్టులో హాజరుపర్చగా ఒక నెల రిమాండ్ విధించింది.

12/21/2018 - 02:55

తాండూరు, డిసెంబర్ 20: పైనాన్స్‌లో బైక్ తీసుకొన్న పాపానికి ఓ క వ్యక్తి బైక్‌ను పాడు బడ్డ బావిలో తోసేసిన ఫైనాన్స్ సిబ్బం ది నిర్వాకంతో తాండూరు మండలం అం తారం గ్రామంలో గురువారం పెద్ద రగడ చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాలు... ఇలా ఉన్నాయి.

12/21/2018 - 02:44

సైదాబాద్, డిసెంబర్ 20: ఆస్తి వివాదం ఒక కుటుంబంలో చిచ్చురేపింది. భర్తతో విడాకులు పొంది తమ చెంత ఆశ్రయం పొందుతున్న బిడ్డను మమకారం మరిచిన తల్లిదండ్రులు, అక్క అనే ఆత్మీయతను కోల్పోయిన తమ్ముడు కిరాతకంగా హతమార్చాడు. మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకున్న వివరాలు...

12/21/2018 - 02:32

కర్నూలు/ఆదోని, డిసెంబర్ 20: కర్నూలు జిల్లా పోలీసులు ఇద్దరు మట్కాడాన్‌లను అరెస్టుచేసి కడప జైలుకు తరలించారు. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన మట్కాడాన్ సయ్యద్ అసదుల్లాను పోలీసులు అరెస్టుచేశారు. ఇతడు 1991 నుంచి కర్నూలు కేంద్రంగా మట్కా నిర్వహిస్తున్నాడు. ఇతనిపై 50 కేసులు ఉన్నాయి. అదే విధంగా ఆదోనికి చెందిన మట్కాడాన్ ఈరన్నను సైతం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

12/21/2018 - 02:15

హైదరాబాద్, డిసెంబర్ 20: తక్కువ పెట్టుబడులతో ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికిన రిషబ్ చిట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ గుజ్జర్‌ను గురువారం హైదరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రిషబ్ యాజమాన్యం గొలుసుకట్టు పథకంతో వందలాది మందితో పెట్టుబడులు పెట్టారు. ఈ పథకంతో దాదాపురూ. 200 కోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.

Pages