S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/23/2018 - 21:23

తలమడుగు, నవంబర్ 23: గంజాయి సాగుచేసినా, విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ సీఐ లతీఫ్ అన్నారు. మండలంలోని ఝరి గ్రామపంచాయతీ పరిధిలోని టొక్కిగూడ గ్రామానికి చెందిన రైతు పెందూర్ జంగు తన వ్యవసాయ చేనులో అంతరపంటగా గంజాయిని సాగుచేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడి చేసి పంటను ధ్వంసం చేశారు.

11/23/2018 - 05:27

విజయవాడ (క్రైం), నవంబర్ 22: మహిళను హత్య చేసి దోపిడీకి పాల్పడిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి సుమారు రెండున్నర లక్షలు విలువైన 84గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బీ రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

11/23/2018 - 04:39

ధన్వాడ, నవంబర్ 22: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల పరిధిలోని లాల్‌కోట చౌరస్తా దగ్గర జరిగిన హత్యకేసులో ఆరుగురికి జీవితఖైదు విధించినట్లు మరికల్ ఎస్సై జానాకీరాంరెడ్డి తెలిపారు. గురువారం మరికల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ హత్యకేసులో జీవితఖైదు పడిన వారిలో పంతులు విజయభాస్కర్, శ్రీ్ధర్, ఆంజనేయులు, కృష్ణ, లింగన్న, లాలు ఉన్నారన్నారు.

11/23/2018 - 04:06

హైదరాబాద్, నవంబర్ 22: ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 97 లక్షలు హవాలా సొమ్మును నార్త్‌జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21న అర్ధరాత్రి సమయంలో మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అంతర్జాతీయ అహమ్మద్ టూరిస్టు అండ్ ట్రావెల్స్‌ను సిద్ధిక్ అహమ్మద్ నడుపుతున్నారు.

11/23/2018 - 02:11

తిరుపతి, నవంబర్ 22: పాకాల మండలం స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంకు సమీపాన పుత్తూరు రోడ్డు మార్గంలో మోటార్‌సైకిల్‌ను లారీ ఢీకొన్న సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలో ఎం.దీపక్ (4) బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా, తల్లి రాజకుమారి, చెల్లెలు భూమిశ్రీ (3), తాత జగ్గయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

11/23/2018 - 00:52

గొల్లప్రోలు, నవంబర్ 22: గొల్లప్రోలు మండలం చెందుర్తి సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన డ్రైవరుతో సహా 10 మంది టాటా మేజిక్ వాహనంపై తలుపులమ్మ లోవ దైవదర్శనం నిమిత్తం బయలుదేరారు.

11/22/2018 - 23:53

సిద్దిపేట అర్బన్, నవంబర్ 22: వైద్యురాలు నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతిచెందాడని డాక్టర్లను నిలదీసిన సంఘటన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నాడు జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన చిలుముల రవి కడుపు, చాతిలో నొప్పి వస్తుండటంతో 108లో సిద్దిపేట ఏరియా అస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు విషయం చెప్పినా పట్టించుకోలేదు.

11/22/2018 - 23:51

న్యూఢిల్లీ, నవంబర్ 22: దేశంలో జైళ్లలో నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో వివిధ శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను అధికారులు మనుషులుగానే చూస్తున్నారా అని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా ప్రశ్నించింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం జైళ్లలోని పరిస్ధితులు చూస్తుంటే ఖైదీలకు హక్కులున్నాయా? అని అడిగింది.

11/22/2018 - 23:38

మానకొండూర్, నవంబర్ 22: మండల పరిధిలోని గట్టుదుద్దనపల్లి గ్రామానికి చెందిన గొండ లక్ష్మియ్య (50) అనే రైతు విద్యుత్‌షాక్‌తో గురువారం మృతి చెందాడు. గట్టుదుద్దనపల్లి గ్రామానికి చెందిన గొండ లక్ష్మియ్య అనే రైతు రభీ కోసం నారుమడిని దున్నుడానికి వెల్లి నీరు పెడుతుండగా పోలంలో ఉన్న విద్యుత్ స్తంబం సపోర్టు తీగకు లక్ష్మియ్య తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందారు.

11/22/2018 - 23:18

నల్లగొండ రూరల్, నవంబర్ 22: తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న ప్రమాదకర చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని ముగ్గురు సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 18 లక్షల పదివేల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Pages