S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/09/2018 - 23:15

విజయవాడ (క్రైం), నవంబర్ 9: కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేయడంతోపాటు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్తకు ఏడు సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ ఐదో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలోని పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన సలూజ అనే యువతికి మాచవరానికి చెందిన కోనేరు వరుణ్‌కుమార్‌తో 2010లో పెళ్లయింది.

11/09/2018 - 23:12

చీరాల టౌన్, నవంబర్ 9: వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలోని ఆర్టీసీ కాలనీలో దొంగతనం జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. టూటౌన్ సీఐ రామారావు కథనం ప్రకారం బ్యాంకు విశ్రాంత ఉద్యోగి తాడికొండ రాఘవరావు ఈనెల 3న కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో నివాసముంటున్న తన కుమారుడు ఇంటికి వెళ్లాడు. ఇంటి పనిచేసే లక్ష్మికి ఇళ్లును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయలుదేరి వెళ్లాడు.

11/09/2018 - 23:06

గూడూరు, నవంబర్ 9: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త రోకలిబండతో దారుణంగా హత్యచేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ గూడూరు ఏడవ అదనపు జిల్లా జడ్జీ ఎన్.శాంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. సూళ్లూరుపేట గమళ్లవీధిలో వాటంబేడు వెంకటేశ్వర్లు భార్య రేఖతో కలిసి కాపురముంటున్నారు.

11/09/2018 - 23:04

నెల్లూరు, నవంబర్ 9: నగరంలోని కుమ్మరవీధికి చెందిన షేక్ తహసీన్ అనే మహిళను హత్య చేసిన కేసులో నిందితులను శుక్రవారం చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరవీధికి చెందిన షేక్ తహసీన్ (34) విద్యావంతురాలు.

11/09/2018 - 23:01

తిరుపతి, నవంబర్ 9: శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శిల్ప ఆగస్టు 7న ఆత్మహత్యకు పాల్పడటానికి లైంగిక వేధింపులే కారణమని సిట్ విచారణలో తేలిందని సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. డాక్టర్ శిల్ప పీలేరులోని స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది.

11/09/2018 - 22:59

చిత్తూరు, నవంబర్ 9: చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల దారుణ హత్య కేసులో ముద్దాయి అయిన శ్రీనివాసాచారిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీ ఐ శ్రీ్ధర్ తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2015 నవంబర్ 17వ తేదిన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనూరాధతో ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హత్యకు గురయ్యారు.

11/09/2018 - 22:57

తిరుపతి, నవంబర్ 9: ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించి, స్మగ్లర్ల ఆట కట్టించడంపై టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావుతో తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం చర్చలు జరిపారు. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్ స్థానిక కపిలతీర్థం సమీపంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఐజీ కాంతారావును మర్యాద పూర్వకంగా కలిశారు.

11/09/2018 - 22:23

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 9: పార్కింగ్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను దొంగిలిస్తున్న నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు అర్బన్ సిసియస్ అడిషనల్ ఎస్పీ శ్రీరాఘవ తెలిపారు. శుక్రవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను శ్రీరాఘవ వెల్లడించారు.

11/09/2018 - 22:07

కాకినాడ సిటీ, నవంబర్ 9: విధుల నుండి బహిష్కరించిన ఒక కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ సర్పవరం పరిధిలోని ఎపిఎస్‌పి బెటాలియన్ సమీపంలో నివసించే నూకా శివకృష్ణ(26) అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా దుశ్చర్తి పోలీస్ స్టేషన్‌లో పనిచేసేవాడు.

11/09/2018 - 21:58

ఇందూర్, నవంబర్ 9: పాత కక్షలు ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన సంఘటన శుక్రవారం వర్ని మండలం చందూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం చందూర్ గ్రామానికి చెందిన శేషగిరి భూమ్‌రెడ్డి, సుధాకర్ అనే వ్యక్తి మధ్య గత కొనే్నళ్లుగా భూ వివాదానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయని అన్నారు.

Pages