S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/28/2018 - 23:49

గద్వాల, మే 28: గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డులోని టి.వెంకట్‌రెడ్డి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.10 లక్షల విలువైన పత్తి నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా ప్యాకింగ్ చేస్తుండగా టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు.

05/28/2018 - 23:41

జహీరాబాద్, మే 29: పురివిప్పిన పాతకక్షలు ఓ వ్యక్తిని బలితీసుకున్నాయి. మండలంలోని శేకాపూర్‌లో టెంట్‌హౌజ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముస్లీం డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఎండీఏ)అధ్యక్షుడు ఎంఏ గౌస్(38) ను దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించి సీఐ.సైదీశ్వర్ కథనం ప్రకారం..

05/28/2018 - 22:28

ప్రొద్దుటూరు, మే 28: ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన బండి లక్ష్మినరసయ్య క్రికెట్ పంద్యాలు నిర్వహిస్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో కలిసి పట్టుకొని అరెస్టుచేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. వివరాల్లోకెళ్తే...

05/28/2018 - 02:56

నెల్లూరు రూరల్, మే 27: నెల్లూరు మండల పరిధిలోని పొట్టెపాళెం గ్రామానికి చెందిన 11 సంవత్సరాల బాలికపై అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ అవిషేర్ (42) ఆదివారం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆరుబయట ఉండగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉంటున్నవారు వెంటనే స్పందించి అతనికి దేహశుద్ధి చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు.

05/28/2018 - 02:25

న్యూఢిల్లీ, మే 27: మధ్యప్రదేశ్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు హైకోర్టు మరణశిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో జస్టిస్ ఎఎం ఖాన్వికర్, జస్టిస్ ఇందూ మల్హోత్రతో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో దిగువ కోర్టు నిందితులు భగ్వాని, సతీష్‌లకు మరణ శిక్షను ఖరారు చేసింది.

05/28/2018 - 00:05

టెక్కలి, మే 27:మండలంలోని జాతీయరహదారిపై అయోధ్యపురం సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందగా, మరొకరు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. అయోధ్యపురం గ్రామ సమీపంలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న కోళ్ల వ్యాన్ మరమ్మతుకు గురైంది.

05/27/2018 - 23:56

బిట్రగుంట, మే 27 : బోగోలు మండలం ఎస్వీపాలెం పంచాయతీలో సిద్దవరపువెంకటేశ్వరపాలెం గ్రామంలో మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగినట్లు ఉప సర్పంచ్ రాజు శ్రీనివాసులురెడ్డి బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మి ఆలయంలో శనివారం రాత్రి తలుపులకు వేసి ఉన్న తాళం పగలుకొట్టి హుండీని దొంగలు తీసుకెళ్లినట్లు తెలిపారు. చోరీకి గురైన హుండీ సమీపంలోని పొలాల్లో దొరికినట్లు చెప్పారు.

05/27/2018 - 23:29

వేమూరు, మే 27: మొక్కజొన్న ఎండిదండుకు నిప్పటించిన మంటల్లో చిక్కుకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇది. ఎస్‌ఐ అంబటి మన్మధరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమల్తులూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన దేవరకొండ సుబ్బయ్య (80) వేమూరు మండలంలోని పోతుమర్రు రెవెన్యూ గ్రామమైన పులిచింతలపాలెంలో తన మాగాణి పొలానికి మధ్యాహ్నం వెళ్లాడు.

05/27/2018 - 23:24

బేతంచెర్ల, మే 27:కుటుంబ పోషణ కోసం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ అప్పులపాలైన కౌలు రైతు నాయకంటి పుల్లయ్య(45) పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. పుల్లయ్య గత కొనే్నళ్లుగా గ్రామంలోని రైతుల దగ్గర భూమి కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తుండేవాడు.

05/27/2018 - 22:33

సోమందేపల్లి, మే 27 : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుఝామున గుర్తు తెలియని వ్యక్తి (40) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు పాచీ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాల కోసం హిందూపురం రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

Pages