S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/13/2018 - 01:24

కాకినాడ, డిసెంబర్ 12: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను పక్కదారి పట్టిస్తున్న నలుగురు ఘరానా మోసగాళ్లను కాకినాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు.

09/13/2018 - 00:54

పామర్రు, సెప్టెంబర్ 12: స్థానిక పాల ఫ్యాక్టరీ వద్ద సప్లై కాలువ లాకుల సమీపాన బుధవారం కాలువలో బట్టలు ఉతుకుతున్న అత్త, కోడలు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమీపంలోని లాకుల్లో పని చేస్తున్న లస్కర్ నాగరాజు వెంటనే కాలువలోకి దూకి అత్తను కాపాడి ఒడ్డుకు చేర్చాడు.

09/13/2018 - 00:54

మచిలీపట్నం, సెప్టెంబర్ 12: ఇల్లు ఖాళీ చేయమన్న పాపానికి ఇంటి యజమానిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు బుధవారం తీర్పు చెప్పారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

09/13/2018 - 00:36

గూడూరు, సెప్టెంబర్ 12: గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపూర్‌కు చెందిన న్యూడెమోక్రసీ పుల్లన్న దళం కోరియర్ నెమురుగొమ్ముల వీరన్న అలియాస్ గోపయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 తుటాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు సీఐ బాలాజీ నాయక్ తెలిపారు. ఈమేరకు అరెస్టు వివరాలను విలేఖరులకు తెలిపారు. న్యూడెమోక్రసీ రాయలవర్గానికి చెందిన దళ కమాండర్ పుల్లన్న ఇటీవల అరెస్టు చేశామని చెప్పారు.

09/13/2018 - 00:16

కామారెడ్డి, సెప్టెంబర్ 12: జిల్లాలోని రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామంతో పాటు బట్టుతండాలో మంగళవారం శాసనమండలి ప్రతిపక్షనే షబ్బీర్‌అలీ ఎంతో అట్టహాసంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, శిలాఫలకాలు వేశారు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయన వేసిన శిలాపలకాలను, బ్యానర్లను చించివేశారు.

09/13/2018 - 00:01

చౌటుప్పల్, సెప్టెంబర్ 12: పొట్టకూటి కోసం కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న గీత కార్మిక దంపతులను కారు మృత్యుశకటమై పొట్టనపెట్టుకుంది. ఘటన చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి శివారులో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. మండలంలోని గుండ్లబావికి చెందిన చీకూరి బాలయ్య (65), చీకూరి యాదమ్మ (53) దంపతులు కల్లు అమ్ముకుంటూ గత నాలుగు దశాబ్దాలుగా కాలం నెట్టుకువస్తున్నారు.

09/12/2018 - 23:45

రాపూరు, సెప్టెంబర్ 12 : రాపూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సర్కిల్ పరిధిలోని పంగిలి గ్రామ సమీంలో వెలుగొండ అడవుల్లో ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా పంగిలి గ్రామ సమీపంలోని గుట్టలు, కొండలు ఇతర దట్టమైన అటవీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి 70 లీటర్ల నాటు ఊట కనపడటంతో దాన్ని నిశితంగా పరిశీలించి ఆనవాళ్లపై కూపీలాగారు.

09/12/2018 - 23:44

వెంకటగిరి, సెప్టెంబర్ 12: వెంకటగిరి సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డక్కిలి మండలం మోపూరు సొసైటీ అధ్యక్షుడు, టీడీపీ నేత బండి చంద్రారెడ్డి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.

09/12/2018 - 23:32

రేణిగుంట, సెప్టెంబర్ 12: ఎన్‌ఆర్‌ఐ కిడ్నాప్‌ని రేణిగుంట అర్బన్ పోలీసులు ఏడు గంటల్లో ఛేదించి నాటకీయ పరిణామల మధ్య కిడ్నాపర్ స్నేహితులైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

09/12/2018 - 23:29

అల్లవరం, సెప్టెంబర్ 12: అల్లవరం మండలం ఓడలరేవులో ప్రధాన పైపులైకు రంద్రం చేసి లక్షలు విలువైను క్రూడాయిల్ చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజులుగా సాగుతున్న ఈ దందాలో వేలాది లీటర్లు కుడ్రాయిల్‌ను ట్యాంకర్లు ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు.

Pages