S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/06/2018 - 02:06

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 56.48 కోట్ల రూపాయలను తనిఖీల్లో అధికారులు పట్టుకున్నారు. పోలీసు శాఖ సిబ్బంది 38.71 కోట్ల రూపాయలు పట్టుకోగా, ఆదాయం పన్ను శాఖ అధికారులు 17.77 కోట్ల రూపాయలు పట్టుకున్నారు.

11/06/2018 - 01:56

విశాఖపట్నం, నవంబర్ 5: విపక్ష నేత వైస్ జగన్‌పై గత నెల 25న విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ఇప్పించేందుకు విశాఖకు చెందిన ఒక న్యాయవాది స్వచ్ఛంధంగా ముందుకు వచ్చాడు. దాడి ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడంతో శ్రీనివాస్‌కు బెయిల్ కోసం ప్రయత్నించేందుకు కుటుంబీకులు ముందుకు రాలేదు.

11/06/2018 - 01:54

కోచ్చి, నవంబర్ 5: ‘శబరిమల క్షేత్రంలోని అయ్యప్ప ఆలయ దైనందిన వ్యవహారాల్లో చోటుచేసుకునే హక్కు మీకులేదు. అక్కడి శాంతిభద్రతల నిర్వహణ విషయానికే మీరు పరిమితమ’ని కేరళ హైకోర్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ క్షేత్రంలో దైవ దర్శనార్థం కొండెక్కే భక్తులకు కష్టాలు కలిగేలా వ్యవహరిస్తున్న పోలీసుల వైఖరిని సైతం ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

11/06/2018 - 05:08

జనగామ టౌన్, నవంబర్ 5: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఓ (అధికారి) అవినీతి చేప చిక్కింది. రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఆ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. అవినీతి నిరోధక శాఖ డీఎస్‌పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా ఫైర్ ఆఫీసర్ రామగోని సత్యనారాయణ రూ.

11/06/2018 - 00:38

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీనుండి ప్రారంభం అవుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులను విభజించేందుకు సంబంధించిన నోటిఫికేషన్ 2019 జనవరి ఒకటో తేదీన జారీ చేయవచ్చునని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. టి.్ధనగోపాల్ తదితరులు వేసిన పిటిషన్‌పై సుప్రీం తీర్పిస్తూ ఈ విషయం తెలిపింది.

11/06/2018 - 00:25

హైదరాబాద్, నవంబర్ 5: ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ అక్రమ మార్గంలో నగదు మార్పిడి భారీగా జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు ఈ తరహా లావాదేవీలతో పాటు హవాలా, హుండీ ముఠాలపై డేగకన్ను వేశారు. దీంతో అటు టాస్క్ఫోర్స్, ఇటు స్థానిక పోలీసులకు వరుసగా ముఠాలు పట్టుబడుతున్నాయి.

11/06/2018 - 00:24

అల్వాల్, నవంబర్ 5: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చబొల్లారం కృష్ణనగర్ దిన్సిబస్తీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల వల్ల గృహిణి తన ఇద్దరు కూతుళ్లతో పాటు తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కాలిన గాయాలకు చిన్నారులు కేకలు వేయటంతో ఇరుగు పొరుగువారు కలుగ జేసుకుని, ఇంటి దర్వాజాలు పగులగొట్టి కాలిన గాయాలతో ఉన్న వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

11/06/2018 - 00:19

రాజేంద్రనగర్, నవంబర్ 5: సెక్యురిటీ గార్డుగా పని చేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తి, రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

11/05/2018 - 23:45

మచిలీపట్నం, నవంబర్ 5: జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న ప్రతి కేసును ఛాలెంజ్‌గా తీసుకుని నిందితులందరినీ అరెస్టు చేస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. గత నెల 19వతేదీన జిల్లా కేంద్రం మచిలీపట్నం ఐదు రోడ్ల సెంటరులో ఓ వృద్ధురాలి మెడలో బంగారు అభరణాలను తస్కరించిన నలుగురు అంతర్ జిల్లా నేరస్తులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు.

11/05/2018 - 23:30

బనగానపల్లె, నవంబర్ 5:నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామం సమీపంలో సోమవారం ట్రాక్టర్ కిందపడి మండలంలోని చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన వడ్డే మధుసూదన్(19) మృతి చెందినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. పలుకూరు గనుల్లో నాపరాయి లోడింగ్ కోసం వెళ్తున్న ట్రాక్టర్‌లో మధుసూదన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మృతిచెందాడు.

Pages