S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/24/2018 - 01:42

తిరుపతి, జూన్ 23: ఎర్రచందనం స్మగ్లర్‌లకు రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. దట్టమైన అడవుల్లో సంచరిస్తున్న స్మగ్లర్ల కదలికల గుట్టు రట్టు చేయడంలో టాస్క్ఫోర్స్‌కు చెందిన బిట్టు వారి పాలిట సింహ స్వప్నంలా మారుతోంది. ఇప్పటికే పలువురు స్మగ్లర్లను దట్టమైన పొదల్లో దాచివుంచుతున్న ఎర్రచందనాన్ని గుర్తించడంలో బిట్టు తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న విషయం పాఠకులకు విదితమే.

06/24/2018 - 01:32

బి.కోడూరు, జూన్ 23: మండల పరిధిలోని మేకవారిపల్లిలో ఆటో ప్రమాదం జరిగి పందిటి వెంకటసుబ్బమ్మ (50), పందిటి ఆదిలక్షుమ్మ (30) అనే ఇద్దరు మహిళలు మృతిచెందడంతో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకెళ్తే...

06/23/2018 - 05:55

కరీంనగర్ రూరల్, జూన్ 22: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ వాగులో 1984 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల్లో భాగంగా జిల్లాలో కురిసిన వర్షాలకు వాగు పొంగిపొర్లి వంతెనపై నుంచి నీటి ప్రవాహం వెళ్తుండగా, వంతెనపై దాటే క్రమంలో లారీతో సహా అందులోని డ్రైవర్ దౌలత్‌ఖాన్, పశువుల వ్యాపారులు ముగ్దంఖాన్, కటిక శంకర్, వెంకటస్వామి గల్లంతు కాగా, వారి అవశేషాలు శుక్రవారం చేపట్టిన ఇసుక తవ్వకాల్లో బయటప

06/23/2018 - 05:13

అమలాపురం, జూన్ 22: పరువుగల ఉన్నత వర్గాలు నివశించే కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై అమలాపురం పట్టణ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అధుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. ఈ సంఘటన శుక్రవారం కాలనీలో తీవ్ర అలజడి రేపింది.

06/23/2018 - 05:10

ఆలమూరు, జూన్ 22: ఆలమూరు మండలంలో 2003 సంవత్సరంలో ఇటుక బట్టీలో పనిచేసే నక్కా లక్ష్మణరావును అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణపై అప్పటి ఎస్సై రవితేజకు రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ ఆలమూరు కోర్టు న్యాయమూర్తి హెచ్ అమరరంగేశ్వరరావు తీర్పు చెప్పారు.

06/23/2018 - 04:52

జూపాడుబంగ్లా, జూన్ 22:జూపాడుబంగ్లాలో శుక్రవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లు(42) కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా నంద్యాల పట్టణానికి చెందిన మహబుబ్‌బాషా ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ఢీ కొనడంతో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

06/22/2018 - 23:12

పెరవలి, జూన్ 22: పెరవలి అరుంధతీయపేటలో చిన్ననాటి నుండి కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు కాలువ వంతెనపై బైకుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ సైడ్ వాల్‌ను ఢీకొట్టి కాల్వలోకి జారిపడి మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీనితో పెరవలిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

06/22/2018 - 05:14

ముధోల్, జూన్ 21: నియోజకవర్గ కేంద్రంలోని ధనగర్ గల్లిలో బుధవారం రాత్రి అత్తారింటికి అల్లుడు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. సంఘటనకు సంబంధించిన వివరాలను ముధోల్ ఎస్సై భరత్ సుమన్ తెలిపారు. రోళ్ల మారుతి తన మామ, అత్త అయిన తెలగడం చిన్న లింగన్న, కళాబాయి ఇంటి వెనుక వైపు నుండి రేకుల పెకప్పు తీసి కిరోసిన్ పోసి నిప్పంటించాడని అన్నారు.

06/22/2018 - 05:08

గజ్వేల్, జూన్ 21: గజ్వేల్ మండల పరిదిలోని బంగ్లవెంకటాపూర్‌లో ఓ రైతు అప్పులబాదతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యాదగిరి(55) తనకున్న 2 ఎకరాల పొలంలో పంటలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాగే సాగునీటి వసతులు లేకపోవడంతో బోర్లు వేయగా రూ. 5లక్షల వరకు అప్పులు చేశాడు.

06/22/2018 - 05:07

మెదక్ రూరల్, జూన్ 21: ఉదయం నుండి తీవ్ర ఎండ ఉక్కపోతతో జనజీవనం ఉక్కిరిబిక్కిరికాగా సాయంత్రం ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వర్షం అన్నదాతను ఆనందపరిచగా పిడుగుపాటుకు రైతు మృతి చెందగా, చలిపిడుకు గేదె మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం మెదక్‌తోపాటు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. వర్షంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగనున్నాయి.

Pages