S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/05/2018 - 00:08

మాడుగుల, నవంబర్ 4: ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువకుడిపై మాడుగుల పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువతి ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ కేసుపై ఆదివారం అనకాపల్లి డి.ఎస్.పి. కె.వి.రమణ విచారణ చేపట్టారు.

11/04/2018 - 23:56

చాగలమర్రి, నవంబర్ 4:బెంగళూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగలమర్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మేడా శ్రీచరణ్(23) దుర్మరణం పాలయ్యాడు. శ్రీచరణ్ తన సోదరి మేడా శ్రీరమ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారని, ఈ సంఘటనలో శ్రీచరణ్ మృతి చెందగా శ్రీరమ్యకు తీవ్రంగా గాయపడినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

11/04/2018 - 23:48

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 4: రైల్వేలో తమకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ 20 లక్షలు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను కటకటాల వెనక్కి పంపారు. పట్ట్భాపురం పోలీసులు ఆదివారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత వివరాలను వెల్లడించారు.

11/04/2018 - 23:42

పుత్తూరు, నవంబర్ 4: పట్టాలు దాటుతున్న ఓ యువకుడిని గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందాడు. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆనంబట్టులో నివాసం ఉంటున్న టీకే సాయికార్తిక్ (24) ఆదివారం ద్రౌపదీదేవి ఆలయం ఎదురుగా ఉన్న రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో గూడ్స్ రైలు అతనిని ఢీకొట్టింది.

11/04/2018 - 23:28

సుండుపల్లె, నవంబర్ 4: మండల పరిధిలోని దినె్నమీద బలిజపల్లెకు చెందిన బాలక్రిష్ణ(55)పై హత్యాయత్నం జరిగింది. వివరాలలోకి వెళ్లితే.. బాలక్రిష్ణ అలియాస్ బాల ఆదివారం తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామ పరిధిలోని తన మామిడి తోట వద్దకు స్కూటీపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

11/04/2018 - 23:24

కళ్యాణదుర్గం, నవంబర్ 4 : మండల పరిధిలోని యర్రంపల్లి సమీపంలో ఆదివారం ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎనుములదొడ్డి నుంచి కళ్యాణదుర్గం వస్తున్న ఆటో నారాయణపురం-యర్రంపల్లి గ్రామాల మధ్య అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తిమ్మన్న(70) మృతి చెందాడు. ఓబుళేసు, వీరేష్ తీవ్రంగా గాయపడగా అనంతపురం తరలించారు.

11/04/2018 - 23:23

కదిరి, నవంబర్ 4: పట్టణంలోని నిజాంవలీ కాలనీ సమీపంలో రైలు కింద పడి బాబ్‌జాన్ (32) ఆదివారం ఉదయం మృతి చెందాడు. బాబ్‌జాన్ అరవ గుడిసెల్లో నివాసముంటూ తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తాగుడుకు బానిసై మతిస్థిమితం లేక తిరిగేవాడని, రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

11/04/2018 - 21:43

ఇచ్ఛాపురం(రూరల్), నవంబర్ 4: మండలంలో లొద్దపుట్టి వద్ద జాతీయరహదారి వద్ద రోడ్డుప్రమాదంలో 5 సంవత్సరాలు వయస్సుగల పైల హేమంత్ మృతి చెందాడు. లొద్దపుట్టికి చెందిన యోగేష్, తల్లి నిర్మల కలిసి హేమంత్ తులసమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరిగి జాతీయరహదారి డివైడర్ గుండా వస్తూ రోడ్డు దిగి గ్రామానికి వెళ్తుండగా కంచిలి వైపు నుండి బరంపురంకు వెళ్తున్న లారీ ఢీ కొంది.

11/04/2018 - 04:42

వెంకటాచలం, నవంబర్ 3: యువతిని నమ్మించి స్వీట్‌లో సెనైడ్ ఇచ్చి స్నేహితులే దారుణంగా హత్యచేసిన సంఘటన మండలంలోని కాకుటూరు పంచాయతీ పరిధిలోని పాత రబ్బర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు నగర పరిధిలోని చిన్నబజార్ ప్రాంతం కుమ్మరివీధికి చెందిన షేక్ తహసీన్ (34) ఏంసీఏ వరకు చదువుకుంది. విద్యార్థులకు ట్యూషన్లు చెప్పటంతోపాటు స్థానికంగా వడ్డీవ్యాపారం కూడా చేస్తోంది.

11/04/2018 - 04:36

భద్రాచలం టౌన్, నవంబర్ 3: మావోయిస్టు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చర్ల ఎస్సై రాజువర్మ ఆధ్వర్యంలో సివిల్ పోలీసులు, 141 సీఆర్‌పీఎఫ్ జవాన్లు కుర్నపల్లి రోడ్డులో దానవాయిపేట శివారులో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

Pages