S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/14/2018 - 00:27

గచ్చిబౌలి, ఆగస్టు 13: భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమని పట్టించుకోవడంలేదని.. పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బును కూడా సదరు మహిళకే ఇచ్చాడని భార్య గొడవ పెట్టుకోవడంతో ఆమెను కడుపులో కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయిన సంఘటన గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

08/14/2018 - 00:11

హనుమాన్‌జంక్షన్, ఆగస్టు 13: విశాఖ జిల్లా చింతపల్లి నుంచి తమిళనాడు దిండిగల్ ప్రాంతానికి ఆక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని హనుమాన్‌జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం హనుమాన్ జంక్షన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు.

08/14/2018 - 00:09

విజయవాడ (క్రైం), ఆగస్టు 13: పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లు, వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించే టాస్క్ఫోర్స్ రూటు మార్చింది. ప్రజారోగ్య భద్రతపై దృష్టి సారించే క్రమంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై కొరడా ఝుళిపిస్తోంది.

08/13/2018 - 23:45

కోరుట్ల, ఆగస్టు 13: పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తూ ఇబ్బందిపాలు చేస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన అన్నదమ్ములైన బాస భూమేశ్వర్, బాస రాజగంగారాం అనే అక్రమ ఫైనాన్స్ నిర్వాహకులను సోమవారం కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు.

08/13/2018 - 23:43

కరీంనగర్ (లీగల్), ఆగస్టు 13: చిట్‌ఫండ్‌ను ఎత్తివేసి కోట్ల రూపాయలు తన ఖాతాలో జమ చేసుకొని చేతులెత్తేసిన కరుడుగట్టిన ఘరానా మోసగాడు, అభయమిత్ర చిటఫండ్ నిర్వాహకుడు గుర్రం సంజీవ రెడ్డి (45)కి కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పార్థసారథి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. కేసు వివరాల్లోకి వెళితే..నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో ముకరంపురా లో అభయమిత్ర చిట్‌ఫండ్‌ను స్థాపించారు.

08/13/2018 - 23:43

జగిత్యాల టౌన్, ఆగస్టు 13: జగిత్యాల మండలం చల్‌గల్ మామిడి మార్కె ట్ సమీపంలో సోమవారం రాత్రి చెట్టుకు ఢీ కొని కంటె ప్రవీణ్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ ఎస్సై అంజయ్య కథనం ప్రకారం మృతుడు చల్‌గల్ నుండి తన ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో ప్రక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

08/13/2018 - 23:33

ములుగు, ఆగస్టు 13: మర్కూక్ మండలం భావానందాపూర్ గ్రామ శివారులోని కూరగాయల తోటలో శ్రీనివాస్(27) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ శివలింగం తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బావానందాపూర్ గ్రామ శివారు బండకుంట శివారులోని కూరగాయల తోటలో ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌లు వేర్వేరు తోటల్లో పనిచేస్తూ ఇద్దరు ఒకే రూంలో కలిసి ఉంటున్నారు.

08/13/2018 - 23:30

తూప్రాన్, ఆగస్టు 13: నగరం నుండి ఇంకి వెళుతున్న ముగ్గురు యువకుల బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తూప్రాన్ పట్టణ శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తూప్రాన్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన యువకులు రాజు, సంతోష్, సురేష్‌లు టీఎస్ 35-2668 నంబరు గల ఫల్సర్ వాహనంపై స్వగ్రామానికి వెళుతున్నారు.

08/13/2018 - 23:25

గద్వాల, ఆగస్టు 13: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండల పరిధిలోని ఓబులోనిపల్లి గ్రామ సమీపంలో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు(పిల్లలకు పేర్లు పెట్టలేదు) మృత్యువాత పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓబులోనిపల్లి గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు, చిన్న నర్సింహులు అన్నదమ్ములు. వీరికి గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం ఉంది.

08/13/2018 - 23:22

కర్నూలు, ఆగస్టు 13:మహిళను వేధించిన కేసులో ఆత్మకూరు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం చేయాల్సిన రక్షణ అధికారి మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తుండటంతో ఆధారాలతో సహా ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో సదరు ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

Pages