S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/03/2018 - 22:38

కణేకల్లు, నవంబర్ 3 : మండల పరిధిలోని జక్కలవడికి గ్రామానికి చెందిన రైతు చిద్దలప్పగారి ఆంజనేయులు (36) శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు ఆంజనేయులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే పంటలు సాగు చేసి ప్రతిసారి నష్టం వస్తుండటంతో దాదాపు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు.

11/03/2018 - 00:06

ఘట్‌కేసర్, నవంబర్ 2: మహిళపై దాడి చేసి బెదిరించి మెడలోని బంగారు ఆభరణాల చోరీ కేసులో ముగ్గురిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద బైక్, చైన్, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు.

11/03/2018 - 00:04

ఉప్పల్, నవంబర్ 2: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్‌గూడ మధురనగర్‌లో నివసిస్తున్న బల్లెం సాయి మనీష్ (22) ప్రైవేటు ఉద్యోగి.

11/03/2018 - 00:03

అల్వాల్ : కంటోనె్మంట్ బొల్లారంలో తప్పిపోయిన కేంద్రీయ విద్యాలయం పాఠశాల విద్యార్థులు ముగ్గురు ముంబయికి చెరుకున్నట్లు శుక్రవారం ఉదయం సమాచారం వచ్చింది.

11/03/2018 - 00:02

ఉప్పల్, నవంబర్ 2: పీర్జాదిగూడ బస్‌డిపో బుద్ధానగర్‌లో ఉన్న శ్రీవేంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్‌పై మేడిపల్లి పోలీసులు దాడి చేసి నిబంధనలు ఉల్లంఘించి గర్భిణికి స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ ఎవరని అందిచారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి సెంటర్ నిర్వాహకులైన డాక్టర్లు స్వాతి, ఆమె భర్త విజయ్ కుమార్‌ను అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు.

11/02/2018 - 23:49

బాలానగర్, నవంబర్ 2: రాజాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తలుపుల తాళం పగులగొట్టి పంచలోహ విగ్రహాలను దొంగిలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం ప్రతినిత్యం పూజలు చేసే పూజారి పూజలు నిర్వహించి దేవాలయం పక్కనే ఉన్న తన ఇంటింటి వెళ్లినట్లు ఎస్సైతెలిపారు.

11/02/2018 - 23:22

రాజవొమ్మంగి, నవంబర్ 2: మన్యంలో మావోయిస్టుల కదలికలు ఉండటంతో శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ వసతి గృహం సమీపంలో పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. విశాఖ ఏజెన్సీ నుండి జిల్లా ఏజెన్సీకి మావోయిస్టులు తరలివచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే అవకాశమున్నందున ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించి, ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేశారు.

11/02/2018 - 23:16

పామూరు, నవంబర్ 2: పొట్టకూటి కోసం ఒరిస్సా నుంచి పామూరు మండలానికి వలస వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మండలంలోని భూమిరెడ్డిపల్లి స్టేజీవద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. భూమిరెడ్డిపల్లిలో ఎఎస్పీ ఇండస్ట్రీయల్ క్వారీలో మిషన్ల రిపేరు నిమిత్తం రెండురోజుల క్రితం బరిస్సాకు చెందిన లోదిన్ మద్ది (32), సూర్‌మద్ది (26) మెకానిక్‌లు పామూరుకు వచ్చినట్లు సహచర కూలీలు తెలిపారు.

11/02/2018 - 23:11

అనంతసాగరం, నవంబర్ 2 : సోమశిల జలాశయంలో గుర్తు తెలియని యువతి (17) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 17 ఏళ్ల వయస్సున్న యువతి జలాశయంలో దూకినట్లు ప్రాజెక్టు సిబ్బంది తమకు సమాచారం ఇచ్చారని ఎస్‌ఐ వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు.

11/02/2018 - 22:38

భువనగిరి, నవంబర్ 2: రోడ్డు దాటుతున్న మహిళా, చిన్నారి పాపను ట్రాక్టర్ ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పట్టణంలోని ప్రధాన పోస్ట్ఫాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రవీంద్రభారత్ నగర్‌కు చెందిన రవళి (30), కోడలు వరసైన చిన్నారి అక్షర(4) వారిరువురు స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి తిరిగి వస్తున్నారు.

Pages