S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/17/2018 - 03:38

కోడూరు, మార్చి 16: కోడూరు మండలం పాలకాయతిప్ప సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సైకం వెంకటరాజు గురువారం రాత్రి గల్లంతయ్యాడు. తాను ఉన్న బోట్‌లో ఇంకా ఐదుగురు మత్స్యకారులు ఉండగా శుక్రవారం ఉదయం వెంకటరాజు కనిపించకపోవటంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. నాగాయలంక గుల్లలమోద గ్రామానికి చెందిన జాలర్ల బృందం మూడు రోజుల క్రితం సముద్రంలో వేటకు బయలుదేరి వెళ్లింది.

03/17/2018 - 03:27

జీడిమెట్ల, మార్చి 16: రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు వ్యక్తులు మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ఊటికూరి మహే శ్ (28) ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇస్నాపూర్‌కు చెందిన చెడుదూటి సాయితేజ (21) ఎలక్ట్రీషియన్. ఇద్దరు కలిసి టీఎస్ 15 ఈఎస్ 3767 నంబరు గల రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై స్వగ్రామం నుండి తూప్రాన్‌కు వెళ్తున్నారు.

03/17/2018 - 03:24

గచ్చిబౌలి, మార్చి 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిపై కొందరు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించి శుక్రవారం గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటన హెచ్‌సియులో కలకలం రేపింది.

03/17/2018 - 03:25

హైదరాబాద్, మార్చి 16: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో పట్టుబడుతున్నారు. నగర ట్రాఫిక్ జాయింట్ సిపి అందించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి15 వరకు చేపట్టిన డ్రైవ్‌లో 6,781 మందిపై చార్చిషీట్లు దాఖలు చేయగా, వారిలో 1103 మందికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

03/17/2018 - 03:06

హైదరాబాద్, మార్చి 16: దొంగిలించిన డెబిట్ కార్డు ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు నిర్వహించి రూ.6.30 లక్షలు స్వాహా చేసిన కేసులో ముగ్గురు నిందితులను సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజిగూడకు చెందిన నిషా కటారియా అనే మహిళ ఫిబ్రవరి 5న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

03/17/2018 - 02:53

ఖైరతాబాద్, మార్చి16: జూబ్లీహిల్స్‌లో నలుగురు యువకుల మధ్య జరిగిన స్వల్ప వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతీనగర్, హైమావతి నగర్‌కు చెదిన సుధీర్‌కుమార్ (23), కంకర చిప్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.

03/17/2018 - 02:36

*్భర్యకు తీవ్ర గాయాలు

03/17/2018 - 01:40

న్యూఢిల్లీ, మార్చి 16: ఉమ్మడి ఏపీలో 2013లో జరిగిన డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పదోన్నతుల్లో సీనియర్లుకు అన్యాయం జరిగిందంటూ పలువురు సబ్ కలెక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ను దాఖల చేశారు.

03/17/2018 - 03:17

హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటనకు సంబంధించి మహంకాళి పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ జనరల్ బజార్‌లో నివాస ముంటున్న ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

03/17/2018 - 01:03

హైదరాబాద్, మార్చి 16: తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటీషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

Pages