S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/01/2018 - 23:43

నంద్యాల, నవంబర్ 1: రైతులకు ఈపాస్‌బుక్కులు మంజూరు చేయడంలో వీ ఆర్ ఓలు చూపిస్తున్న చేతి వాటం, అవినీతికి రైతులు విసిగి వేసారి ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా వీ ఆర్ ఓలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నప్పటికి వారి పనితీరులో మార్పురావడం లేదు.

11/01/2018 - 23:40

సత్తెనపల్లి, నవంబర్ 1: మండల పరిధిలోని పెదమక్కెన గ్రామంలో ఓ వ్యక్తి భార్యను బాడిశతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వీరయ్యచౌదరి తెలిపిన సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఈ సంఘటన జరిగింది. గరికపాటి వెంకటరమణ(35)ను ఆమె భర్త కోటేశ్వరరావు క్షణికావేశంతో బాడిశతో తల మీద మోది హత్య చేశాడు.

11/01/2018 - 23:36

చింతకొమ్మదినె్న, నవంబర్ 1: కర్నూలు -చిత్తూరు జాతీయ రహదారి చింతకొమ్మదినె్న మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ మొదటి మలుపులో గురువారం జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొన్న ప్రమాదంలో 15మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. సికెదినె్న ఎస్‌ఐ హేమకుమార్ తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి.

11/01/2018 - 05:18

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 31: మండలం లోని వాటర్‌ట్యాంకు తండా పంచాయతీ శివారులోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో మంగళవారం రాత్రి కారు ప్రమాదవశాత్తు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఎండీ.ఖమ్రుల్లా (57) ప్రభుత్వ ఉద్యోగి మరణించాడు.

11/01/2018 - 00:35

కరీంనగర్, అక్టోబర్ 31: పట్టణంలో రూ.12 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు నగర పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు. వాహనాలను తనిఖీ చేస్తున్న విషయం గ్రహించిన కొందరు అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల మాదిరిగా భారీ మొత్తంలో తరలించుకుపోతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

11/01/2018 - 00:25

జగదేవ్‌పూర్, అక్టోబర్ 31: మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామ శివారులో బుధవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నగదు స్వాదీనం చేసుకున్నారు. గజ్వేల్ సీఐ శివలింగం, జగదేవ్‌పూర్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనీఖిల్లో కారులో తరలిస్తున్న రూ. 5 లక్షల 40వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

11/01/2018 - 00:12

మచిలీపట్నం, అక్టోబర్ 31: ఇరువురు యువకుల నిండు నూరేళ్ల జీవితాన్ని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మారుమూల ప్రాంతమైన బందరు మండలం వాడపాలెం శివారు గరువు గ్రామానికి చెందిన ఆ ఇరువురు యువకులు బుధవారం చిన్నాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

11/01/2018 - 00:11

మైలవరం, అక్టోబర్ 31: ఒక యువకుడిని దారుణంగా కొట్టి చంపి ఆనవాళ్ళు లేకుండా కాల్చివేసిన సంఘటనలో నిందితులను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మైలవరం సీఐ చింతా సూరిబాబు, ఎస్‌ఐ జి రామకృష్ణ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖర్లకు వివరించారు. మైలవరం బాలయోగి నగర్‌కు చెందిన మిరియాల తిరుపతమ్మకు సుమారు 20 ఏళ్ళ క్రితం గుంటూరుకు చెందిన నాగరాజుతో వివాహమైంది.

11/01/2018 - 00:00

మర్రిపూడి,అక్టోబర్ 31: మండలంలోని నిర్మమాపురం గ్రామానికి చెందిన పోకల రాజశేఖర్‌రెడ్డి (40)అనే వ్యక్తిని కుటుంబ కలహాలతో తన మేనమామ ముత్తుమల కాశిరెడ్డి బడిసెతో పొడిచి చంపిన కేసులో నిందితుడు కాశిరెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. బుధవారం ముద్దాయిని అరెస్టుచేసి పొదిలి కోర్టుకు హాజరుపర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

10/31/2018 - 23:48

అరకులోయ, అక్టోబర్ 31: అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు గత నెల 23వ తేదిన హత్య చేయడంతో కోపోద్రికులైన అభిమానులు పోలీస్ స్టేషన్లపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

Pages