S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/16/2018 - 22:42

గార్ల, జూలై 16: పవిత్రమైన దేవాలయాల్లో, ఇండ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకోవటంతో పాటు ఆరు లక్షల 85 వేల రూపాయాల రెండు వందల రూపాయాల విలవైన బంగారం, వెండి, ఇత్తడి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

07/16/2018 - 22:39

అన్నపురెడ్డిపల్లి, జూలై 16 : మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామంలో కారు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది.

07/16/2018 - 22:35

కర్నూలు, జూలై 16 : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రకాష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపింది. వివరాలు.. నగరంలోని బుధవారపేటకు చెందిన ప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై భార్య తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు.

07/16/2018 - 22:26

లక్కవరపుకోట, జూలై 16: స్థానిక పోలీసులు మిస్సింగ్ మిస్టరీ చేధించారు.

07/16/2018 - 04:40

వరంగల్ క్రైం, జూలై 15: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (కేకేడబ్ల్యూ) జిల్లాల కార్యదర్శి దామోదర్‌కు కొరియర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా సివిల్ లిబర్టీ కమిటీ కార్యదర్శి రమేష్ చం దర్‌ను శనివారం సాయంత్రం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 5లక్షల నగదు, విప్లవ సాహిత్యం, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

07/16/2018 - 04:40

భీమదేవరపల్లి, జూలై 15: ముల్కనూరులో 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని నాలుగు వాహనాలను సీజ్ చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ముల్కనూరు ఎస్సై డేగల రమేష్ తెలిపారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంగల్‌దుబ్బ వద్ద శ్యాంసుందర్‌రెడ్డి ఇంటి వద్ద రెండు గదులలో నిలువ ఉంచి న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

07/16/2018 - 04:34

సీలేరు, జూలై 15: ఆంధ్రా- ఒడిశా మీదుగా కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే 1,060 కిలోల గంజాయిని ఆదివారం తెల్లవారు జామున ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. రవాణాకు ఉపయోగించిన కంటైనర్‌తోపాటు హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

07/16/2018 - 01:59

రేణిగుంట, జూలై 15: ఎర్రచందనం స్మగ్లర్ హాజీవలి పోలీసుల విచారణలో ఉండగా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై డీఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు విచారణ చేపట్టారు. ఆదివారం చిత్తూరు జిల్లా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటలసేపు విచారణ చేశారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.

07/16/2018 - 01:51

హైదరాబాద్/ కేపీహెచ్‌బీకాలనీ, జూలై 15 : సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ కూరగాయల విక్రయం ముసుగులో అధిక సంపాదనకు ఆశపడి గంజాయి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/16/2018 - 01:37

కోదాడ: సూర్యాపేట శివారులోని దండుమైసమ్మ దేవాలయం వద్ద మొక్కు తీర్చుకొని తిరిగి వెళ్తున్న ట్రాలీ ఆటో 65వ నెంబరు జాతీయ రహదారి కోదాడ బైపాస్‌లో ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Pages