S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/14/2018 - 23:45

రామచంద్రపురం, అక్టోబర్ 14: కె గంగవరం మండలం కుందూరు జడ్పీ హైస్కూలు వద్ద ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పిడుగు పడి బీటెక్ చదువుతున్న సుంకర పవన్ అనే విద్యార్థి మరణించాడు. అతనితోపాటు మరో ఇద్దరు సమీపంలోనే ఉన్నప్పటికీ వారు పిడుగు పాటు నుంచి రెప్పపాటులో తప్పించుకున్నారు.

10/14/2018 - 23:14

సీలేరు, అక్టోబర్ 14: మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసినట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మిశ్రా తెలిపారు.

10/14/2018 - 23:08

పాచిపెంట, అక్టోబర్ 14: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. మండలంలోని నీలమవలస గ్రామానికి చెందిన దళాయి సన్యాసిరావు(19)ను ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడని ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం సన్యాసిరావు గ్రామంలో జరగనున్న ఓ శుభకార్యానికి అవసరమైన సామాన్ల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం గురివినాయుడుపేటకు వచ్చాడు.

10/14/2018 - 05:17

గుర్గావ్, అక్టోబర్ 13: ఒక జడ్జి భార్య, కుమారుడిపై అతని అంగరక్షకుడే కాల్పులు జరిపిన ఉదంతమిది. ఢిల్లీలో శనివారం జరిగిన ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, వారి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు ఢిల్లీ డీసీపీ సులోచన గజ్‌రాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

10/14/2018 - 04:55

విజయవాడ (క్రైం), అక్టోబర్ 13: బెజవాడ కేంద్రంగా చేసుకుని పొరుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ 22మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 13లక్షలకు పైగా నగదుతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

10/14/2018 - 01:53

జఫర్‌గడ్, అక్టోబర్ 13: రోజు రోజుకూ స్ర్తిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయ. నగరంలో చదువుకుంటున్న ఓ బాలిక దసర సెలవు రావ డంలో ఇంటి వచ్చింది. కామంలో కళ్లు మూసు కుపోయన ఓ యువకుడు తన ఇంటి సమీపం లోని ఓ బాలికపై పశువుగా ప్రవర్తించాడు.

10/14/2018 - 01:47

గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని రాజిరెడ్డిపల్లి కుంటలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి గజ్వేల్ సీఐ ప్రసాద్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన శశాంక్(11) తన స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు రాజిరెడ్డిపల్లి కుంటలో దిగాడు.

10/13/2018 - 23:09

నక్కపల్లి, అక్టోబర్ 13: ఇక్కడికి సమీపంలోని వేంపాడు టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారిపై శనివారం తమిళనాడుకు చెందిన కొంతమంది దుండగులు మారణాయుదాలతో వచ్చి అదేరాష్ట్రానికి చెందిన గంజాయి స్మగ్లర్‌గా అనుమానిస్తున్న ఒక యువకుడిని సినీ ఫక్కీలో హత్యోదంతం స్థానికంగా సంచలనం రేగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణానికి సమీపంలో గల పుదూరు గ్రామానికి చెందిన పి.

10/13/2018 - 23:07

నర్సీపట్నం, అక్టోబర్ 13: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలంలోని యరకన్నపాలెం గ్రామంలో ఈసంఘటన చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీను అందించిన వివరాల ప్రకారం యరకన్నపాలెం గ్రామానికి చెందిన చిటికెల కోటయ్యనాయుడుకు కోటవురట్ల మండలం సుర్లవానిపాలెంకు చెందిన హేమలత(24)తో 2013 మార్చిలో వివాహం జరిగింది.

10/13/2018 - 23:05

విజయనగరం, అక్టోబర్ 13: అంతర్‌జిల్లా నేరస్తుడు కొర్నాల పైడిరాజును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తికి అందిన సమాచారం మేరకు వన్‌టౌన్ ఎస్సై, సిబ్బందితో కలసి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుని నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరచుకున్నారు.

Pages