S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/04/2018 - 23:53

నారాయణఖేడ్ సెప్టెంబర్ 4 అంతర్ రాష్ట్ర బంది పోటు ముఠాను నారాయణఖేడ్ పోలీసులు సీఐ వెంకటేశ్వర్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో విచారణ జరిపి మంగళవారంనారాయణేడ్ మండలం నిజంపేట బస్టాండ్ వద్ద మోటారు సైకిల్‌పై నాందేడ్ వైపునుంచి వస్తుండగా పట్టుకున్నామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

09/05/2018 - 04:45

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ లుంబినీ, గోకుల్‌చాట్ పేలుళ్ల కేసులో ఇద్దర్ని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ఈ నెల 10వ తేదీన ప్రకటించనున్నట్టు ఏన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం వెల్లడించింది. శిక్షలూ ఆ రోజే ఖరారు చేస్తారు. పేలుళ్లకు ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులే కారణమని కోర్టు స్పష్టం చేసింది.

09/04/2018 - 23:18

చిత్తూరు, సెప్టెంబర్ 4: చీటీల పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని చీటీల నిర్వాహకుడు ఉడాయించిన సంఘటన చిత్తూరు నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో మంగళవారం బాధితులు ఆందోళనకు దిగి చివరకు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు నగరంలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడు నాగరాజు గత కొంత కాలంగా నగరంలో చీటీలు, ఫైనాన్స్ నడిపేవాడు.

09/04/2018 - 22:30

నందిపేట, సెప్టెంబర్ 4: నందిపేట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై గల ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ సిలెండర్ ఫిల్లింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించి, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

09/04/2018 - 02:11

లక్నో, సెప్టెంబర్ 3: ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన ట్యూబ్‌వెల్ ఆపరేటర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు పేపర్ల లీకేజీకి సంబంధించి 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ పోస్టులకు శనివారం జరగాల్సిన హిందీ పరీక్ష పత్రం లీక్ కావడంతో యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ పరీక్షను వాయిదా వేసింది.

09/04/2018 - 01:45

రైల్వేకోడూరు, సెప్టెంబర్ 3: రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, నల్లమల అడవుల నుంచి గత 15 ఏళ్లలో సుమారు రూ.25 వేల కోట్ల ఎర్రచందనం చైనాకు అక్రమంగా తరలిపోయిందని టాస్క్ఫోర్స్ ఐజీ డాక్టర్ మాగంటి కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు.

09/04/2018 - 03:24

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 3: అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన రైతు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల సుధాకర్ (34) అనే కౌలు రైతు క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

09/04/2018 - 03:14

వనస్థలిపురం, సెప్టెంబర్ 3: డబ్బులకు కక్కుర్తి పడి పోస్టల్ ఉద్యోగిని హత్య చేసిన సంఘటనలో వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

09/04/2018 - 04:06

డెహ్రాడూన్: ఉత్తరాఖంఢ్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ 200 మీటర్ల లోయలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. కొండ చరియలే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గంగోత్రి నుంచి 15 మందితో తిరిగి వస్తున్న టేంపోట్రావెలర్ షంగ్లై వద్ద లోయలోకి బోల్తాపడిందని విపత్తుల సన్నద్ధత అధికారి దేవేంద్ర పట్వాల్ వెల్లడించారు.

09/04/2018 - 04:19

హైదరాబాద్: నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ళ కేసుపై మంగళవారం తీర్పు వెలువడనున్నది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు చర్లపల్లి జైలు ప్రత్యేక కోర్టులో విచారించిన సంగతి తెలిసిందే. కాగా, రిజర్వ్‌లో ఉన్న తీర్పును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.

Pages