S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/29/2018 - 21:42

సోంపేట, అక్టోబర్ 29: మండలం, ఎర్రముక్కాం గ్రామానికి చెందిన టి.సరస్వతి(47) అనే మహిళ కిడ్నీ వ్యాధితో సోమవారం వైజాగ్‌లో మృతి చెందింది. కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటపడి రెండు నెలలు వ్యవధిలో మృతి చెందడంతో మృతురాలుకు చెందిన ఇద్దరు కుమార్తెలు దివ్య,లక్ష్మిలు బోరున విలపిస్తున్నారు. మృతురాలు భర్త పాపారావు గుజరాత్ రాష్ట్రం, కాండ్లాలో వలస కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

10/29/2018 - 21:41

పలాస, అక్టోబర్ 29: తిత్లీ తుపాన్ ధాటికి నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు పునరుద్దరణ సహాయక చర్యల్లో వున్న సీతంపేట మండలం, కిడిప గ్రామానికి చెందిన కె.చంద్రమోహన్‌కు తీవ్ర గాయాలైనట్లు సోదరుడు కె.శంకరరావు తెలిపారు. మెళియాపుట్టి మండలం, గాతవలస సమీపంలో విద్యుత్తు స్తంభాలు పునరుద్దరణ చేయడానికి విద్యుత్తు వైర్లును వేయడానికి విద్యుత్తు స్తంభం ఎక్కిన చంద్రమోహన్ ప్రమాదవశాత్తు కిందకు జారిపడ్డాడు.

10/29/2018 - 06:40

* విలేఖరుల సమావేశంలో పులివెందుల డీఎస్పీ నాగరాజ

10/29/2018 - 05:36

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 28: జంగారెడ్డిగూడెంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంకు చెందిన పోకల నాగ దుర్గాప్రసాద్ ఈ నెల 27వ తేదీ శనివారం జంగారెడ్డిగూడెంలో రవాణా శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న ఒక భవనంలో పురుగుల మందు సేవించి స్నేహితులకు సమాచారం అందించాడు.

10/29/2018 - 05:36

ఏలూరు, అక్టోబర్ 28 : ఒక వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మనస్థాపానికి గురై ఆ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు మండలం ఏపూరు పంచాయితీ ఆత్రేయపురానికి చెందిన గొల్లపల్లి దేవసాయం (45) అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎస్‌సి, ఎస్‌టి కేసు గతంలో నమోదైంది.

10/29/2018 - 04:49

లింగపాలెం, అక్టోబర్ 28: మానసిక ఒత్తిడికి గురై భార్యపై అనుమానంతో కత్తితో దాడిచేసి, అడ్డువచ్చిన మనుమరాలిపై కూడ దాడి చేసి గాయపరిచి, అనంతరం భయంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఉన్మాది ఉదంతమిది. పశ్చిమ గోదావరి జిల్లా ఘటన లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య, మనుమరాలు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

10/29/2018 - 04:37

విశాఖపట్నం, అక్టోబర్ 28: విశాఖ విమానాశ్రయంలో తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల కడుపులో బంగారం ఉందని గమనించి కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మలేషియా నుంచి విశాఖ వచ్చిన విమానంలో తమిళనాడుకు చెందిన అబ్దుల్, సాధిక్, అజారుద్దీన్ తమ కడుపులో బంగారం పెట్టుకుని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని కస్టమ్స్ అధికారులు తెలుసుకున్నారు.

10/29/2018 - 04:22

కరీంనగర్, అక్టోబర్ 28: ఎన్నికల వేళ ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.95 లక్షలు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిలో 4500 మందిని బైండోవర్ చేసినట్లు ఆదివారం పోలీస్ కమిషనరేట్‌లో విలేఖరులకు వెల్లడించారు.

10/29/2018 - 04:54

నెల్లూరు, అక్టోబర్ 28: అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఇంటి యజమాని మృతి తీరని విషాదాన్ని నింపింది. ఆ విషాదాన్ని తట్టుకోలేని కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈక్రమంలో ఒకరు మరణించగా మిగతా ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసుల కథనంతో పాటు సేకరించిన సమాచారం మేరకు.. స్థానిక రంగనాయకులపేటకు చెందిన ముంగర కొండలరావు (50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.

10/29/2018 - 03:48

రాయచోటి, అక్టోబర్ 28 : నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి రూ. 6 లక్షలు కాజేసిన 8 మంది మాయగాళ్లను అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజు తెలిపారు. కడప జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం డీఎస్పీ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Pages