S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/25/2018 - 01:10

లక్నో/ బడౌన్, అక్టోబర్ 24: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌కు వ్యతిరేకంగా పోలీసులు వారం రోజులలోపే రెండో కేసు నమోదు చేశారు. ఆజంఖాన్ రెండేళ్ల క్రితం దళిత నేత, రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఈ రెండో కేసులో అభియోగం మోపారు.

10/25/2018 - 01:09

షాహజహన్‌పూర్ (యూపీ), అక్టోబర్ 24: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధ మహిళపై ఒక దూరపు బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంపూర్‌కు చెందిన ఆ మహిళ డాకియా రాన్‌వాస్ గ్రామానికిగ వచ్చారు. అక్కడే గత నెల 28వ తేదీన దగ్గరి బంధువు అత్యాచారానికి ఒడిగట్టారు.

10/25/2018 - 00:34

కావలి టౌన్, అక్టోబర్ 24: పట్టణంలోని వాయునందన ప్రెస్‌వీధి వినాయకగుడి ఎదురుగా ఉన్న అందే భాస్కర్‌రావు ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

10/25/2018 - 00:19

నెల్లూరు, అక్టోబర్ 24: నెల్లూరు జిల్లాలో బుధవారం చేపట్టిన తనిఖీల్లో 29 మంది అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.80లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలు, వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 27 మంది తమిళనాడు, ఒకరు కేరళ, మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు.

10/24/2018 - 06:30

భీమునిపట్నం, అక్టోబర్ 23: ఒక ప్రైవేటు స్కూల్ బస్ ఒక చిన్నారని ఢీకొనడంతో ఆ చిన్నారి చికిత్సపొందుతూ మృతిచెందిన వైనమిది. దానికి సంబందించిన వివరాలు క్రైం ఎస్‌ఐ శ్రీను అందించిన ప్రకారం భీమిలి మండలం నేరళ్లవలసకు చెందిన జీరు అప్పలరాము కూలి పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు.

10/24/2018 - 05:05

పెరవలి, అక్టోబర్ 23: కానూరులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒకరికి గాయాలు తగలడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గం వారు గాయపరిచిన నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు-నరసాపురం రహదారిపై బైఠాయించి నాలుగు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి.

10/24/2018 - 04:08

తిరుమలగిరి, అక్టోబర్ 23: అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మండల కేంద్రంలోని జనగాం రోడ్డులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.30లక్షల నగదును పట్టుకున్నారు.

10/24/2018 - 04:02

ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 23: మండలంలోని అప్పెపల్లి గ్రామం నంబయ్య కాలనీకి చెందిన తల్లీ, కూతుళ్లు రాయవేని ఇందిర ( 35), రాయవేని లావణ్య (16) పిడుగుపాటుతో మృతి చెందారు. మంగళవారం సా యంత్రం వారు పొలంలో పనిచేస్తుండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో పాటు పిడుగుపడటంతో అక్కడిక్కడే మృతి చెందారు.

10/24/2018 - 02:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను నవంబర్ 13వ తేదీన విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

10/24/2018 - 02:34

తిరుపతి, అక్టోబర్ 23: శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు అంశాలపై ఆరోపణలు చేసిన ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు, ఎంపీ విజయ్‌సాయి రెడ్డిలపై టీటీడీ రూ. 200 కోట్లకు పరువు నష్టం దావాను తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో వేసింది. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో పరువు నష్టం దావా దాఖలు చేసిన దాఖలాల్లేవు.

Pages