S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/23/2018 - 03:43

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉండగా మరో బాలుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. పాడేరు మాజీ ఎంపీపీ ఎస్‌వీవీ రమణమూర్తి కుటుంబ సభ్యులు పెందుర్తిలో నివాసం ఉంటూ విజయదశమి సందర్భంగా ఇటీవల పాడేరు వచ్చారు.

10/23/2018 - 03:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా మహిళలపై అసభ్య ప్రవర్తన, అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారణ జరిపించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది.

10/23/2018 - 02:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాధికార మిత్ర’ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 11, 243(జీ), పంచాయతీ రాజ్ చట్టాలను ఉల్లంఘిస్తూ సాధికార మిత్రలను ఏపీ ప్రభుత్వం నియమించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది.

10/23/2018 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 22: సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు రాంగ్ రూట్‌లో వెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై దంపతులు, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని కార్కానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

10/23/2018 - 01:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: వివాహం చేసుకునేందుకు పురుషుడి వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని, దీనికి సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని దాఖలైన ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన చీఫ్ జస్టిర్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు 25వేల జరిమానా విధించింది.

10/23/2018 - 01:25

మహేశ్వరం, అక్టోబర్ 22: మహేశ్వరం కందుకూర్ కడ్తాల్ అమన్‌గల్ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న కడ్తాల్ గ్రామానికి చెందిన గుద్దేటి సాయికుమార్ 25ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహేశ్వరం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

10/23/2018 - 01:08

గుడివాడ, అక్టోబర్ 22: గుడివాడ పట్టణం, రూరల్ మండలంలోని మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలోని బాణసంచా గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు చేశారు. ముందుగా స్థానిక బంటుమిల్లి రోడ్డులోని పైడి సీతారామయ్య ఫైర్ వర్క్స్ షాపును తనిఖీ చేశారు. లైసెన్స్ పరిధికి లోబడి స్టాక్ నిల్వలు ఉండడంతో మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తా కుమారస్వామికి చెందిన గోడౌన్‌లో తనిఖీలు చేశారు.

10/23/2018 - 01:06

విజయవాడ (క్రైం), అక్టోబర్ 22: ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3.24లక్షల విలువైన 122గ్రాముల బంగారు నగలు, చేతి గడియారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బీ రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

10/23/2018 - 00:39

యాదగిరిగుట్ట రూరల్: యాదాద్రి దేవస్థానం పరిధిలో వ్యభిచార గృహాల నిర్వాహకులు బాలికలను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు అనుసరిస్తున్న అమానవీయ చర్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో కేసుగా స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

10/23/2018 - 00:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: శబరిమల అయప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశ కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు సోమవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. 10-50 మధ్యవయస్కులైన మహిళల ఆలయ ప్రవేశానికి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన నాటి నుంచి కేరళ మండిపోతోంది. హిందూ సంస్థలు, అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Pages