S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/23/2018 - 00:24

హిందూపురం, అక్టోబర్ 22: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు మంచానికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. భర్త పక్కనే నిద్రిస్తుండగా తోటి రోగులు, వారి బంధువులు వార్డులో నిద్రిస్తున్న సమయంలో చిన్న నారాయణమ్మ (65) తాను చికిత్స పొందుతున్న మంచానికి చీర కొంగు కట్టి గొంతుకు బిగించుకుని బలన్మరణానికి పాల్పడింది.

10/23/2018 - 00:18

కాకినాడ, అక్టోబర్ 22: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక శుభకార్యంలో పాల్గొని తిరిగివెళుతున్న 15మంది బృందం ప్రయాణిస్తున్న వ్యాన్‌ను క్వారీ లారీ ఎదురుగా ఢీకొనడంతో తొమ్మది మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాంతానికి చెందినవారు.

10/23/2018 - 00:16

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ముడుపులు తీసుకున్నారన్న వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ముడుపుల వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీబీఐ చీఫ్ అలోక్‌వర్మ, స్పెషన్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

10/22/2018 - 22:36

అనంతపురం సిటీ, అక్టోబర్ 22: ఆత్మకూరు కేశవరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అనంతపురం డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో కేశవరెడ్డికి హత్యకు సంబందించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేశవరెడ్డి అన్న కొడుకేనని తెలిపారు.

10/22/2018 - 05:27

హైదరాబాద్/ అల్వాల్, అక్టోబర్ 21: యువకుల వేధింపులు, వెలికి చేష్టలు, బెదిరింపులు ఓ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న సంఘటన నగరంలో చోటుచేసుకుంది. యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కంటోనె్మంట్‌లోని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

10/22/2018 - 05:13

నర్సంపేట, అక్టోబర్ 21: ‘నేను డీసీపీని... ఎన్‌కౌంటర్ చేస్తా... కొండా మురళీని కొట్టిన.. నళిని ప్రభాత్‌తో కలిసి పనిచేసా... నీది నిషేధించిన పార్టీ... పీపుల్స్ వార్ పేరుతో ఎన్‌కౌంటర్ చేస్తా’నంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడిని ఫోన్‌లో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

10/22/2018 - 00:04

చిత్తూరు, అక్టోబర్ 21: చిత్తూరు రూరల్ మండలం చెన్నసముద్రంలో శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు కథనం మేరకు చిత్తూరు రూరల్ మండలం చెన్నసముద్రానికి చెందిన కేశవులు (54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమార్తెకు సుమారు 13 సంవత్సరాల క్రితం వివాహమైంది.

10/20/2018 - 07:13

చందర్లపాడు, అక్టోబర్ 19: ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకొంది. సేకరించిన సమాచారం ప్రకారం చందర్లపాడులో దసరా పండుగను పురష్కరించుకొని మహిళలు బతుకమ్మలను కృష్ణానదికి తీసుకువెళ్లారు.

10/20/2018 - 06:42

బేగంపేట, అక్టోబర్ 19: బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇన్‌స్పెక్టర్ బుచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రసూల్‌పురకు చెందిన భార్యాభర్తలు రెహమాన్, కౌసర్ బేగం 8 సంవత్సరాల కింది వీరికి వివాహం జరిగింది. రెహమాన్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు.

10/18/2018 - 06:08

విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: బట్టల వ్యాపారం ముసుగులో ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి దోచుకుంటున్న కేసులో ఓ వ్యక్తిని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి సుమారు 4లక్షల రూపాయలు విలువైన చోరీ సొత్తు రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన మహ్మద్ యూనస్ (46) అనే వ్యక్తి గతంలో టింకరింగ్ పని చేసి మానేశాడు.

Pages