S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/12/2018 - 23:10

వై రామవరం, అక్టోబర్ 12: వై రామవరం మండల సరిహద్దు ప్రాంత లోతట్టు గ్రామాల్లో శుక్రవారం అడ్డతీగల సీఐ ఎ మరళీకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు మండలంలోని చింతకర్రపాలెం, జాజిగడ్డ, శింగవరం, జంగాలతోట గ్రామాల ప్రధాన రహదారిలో సిఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ పోలీసు బలగాల సహాయంతో అనుమాస్పద ప్రదేశాల్లో తనికీలు నిర్వహించారు.

10/12/2018 - 23:08

అల్లవరం, అక్టోబర్ 12: అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఉప్పులూరి కిశోర్‌కుమార్ (25) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. ఇందుకు సంబంధించి అల్లవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగమ్మి గ్రామానికి చెందిన కిశోర్‌కుమార్ ఫైనల్ బీటెక్ చదువుతున్నాడు.

10/12/2018 - 23:04

* ఠాగూర్ సినిమా తరహాలో డ్రామాలాడిన ప్రభుత్వవైద్యులు
* మృతదేహంతో జాతీయరహదారిపై ప్రజాసంఘాల ఆందోళన
* డీసీహెచ్‌ఎస్, ఎమ్మెల్యే, సీఐల విచారణకు ఆదేశం
* న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే, డీసీహెచ్‌ఎస్
====================================

10/12/2018 - 23:03

తిరుపతి, అక్టోబర్ 12: స్థానిక రైల్వే కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆరు మంది విద్యార్థులు గురువారం నుంచి కనిపించకపోవడం తిరుపతిలో సంచలనంగా మారింది. వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా శనివారం రాత్రి వరకు వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థుల కోసం తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది.

10/12/2018 - 22:18

నందిపేట, అక్టోబర్ 12: నందిపేట మండల విద్యా వనరుల కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న బొడ్డు ఈశ్వర్(32)అనే వ్యక్తి రాత్రి విధులు నిర్వర్తిస్తూ కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు.

10/12/2018 - 22:11

కోడుమూరు, అక్టోబర్ 12:మండల పరిధిలోని వర్కూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఉల్లి రైతు బోయ చిన్న రాముడు(59) గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు.. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న రాముడు గత మూడేళ్లుగా పంటలు సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాలేదు. ప్రతి ఏటా ఉల్లి పంట సాగు చేస్తూ నష్టపోయిన రాముడు ఈ ఏడాది కూడా ఉల్లికి గిట్టుబాటు ధర లేక కుంగిపోయాడు.

10/12/2018 - 20:57

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 12: మండలంలోని రాఘవాపర్ గ్రామ పంచాయితీ పరిధిలోని గొల్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గత 25 రోజుల కిందట బసంత్‌నగర్ పోలీసు స్టేషన్ వాహనం ఢీకొని లక్ష్మీనారాయణ (45) తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని అదే వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ శుక్రవారం మరణించాడు.

10/12/2018 - 03:17

ఏటూరునాగారం, అక్టోబర్ 11: సిపిఐ మావోయిస్టు చర్ల, శబరి ఏరి యా కమిటి ఆధీనంలో పనిచేస్తూ, ద ళాలకు కావాల్సిన సామాగ్రి అందజేసే మిలిషియా ప్లాటూన్ డిప్యూటి క మాండర్‌తోపాటు మరో ముగ్గురు స భ్యులను అరెస్టుచేసి రిమాండుకు తరలించినట్లు భూపాలపల్లి జిల్లా ఓఎస్డీ కె.సురేష్‌కుమార్ తెలిపారు.

10/12/2018 - 03:00

పెద్దపల్లి, అక్టోబర్ 11: పెద్దపల్లి నుండి సెంటనరీ కాలనీకి వెళుతున్న దంపతులు పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు లారీ డీ కొని భార్య రాజేశ్వరీ మృతి చెందిన సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది.

10/12/2018 - 02:51

తొగుట, అక్టోబర్ 11: ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లిలో గురువారం నాడు జరిగింది. తొగుట సిఐ నిరంజన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Pages