S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/08/2018 - 23:16

చల్లపల్లి, అక్టోబర్ 8: మురుగు బోదెలో ట్రాక్టర్ తిరగబడి ఇరువురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాద సంఘటన మండల పరిధిలోని వెలువోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

10/08/2018 - 23:13

మర్రిపూడి, అక్టోబర్ 8 : జిల్లాలోని పలు పట్టణాలు, మండలాల్లోనే కాకుండా గుంటూరు, నెల్లూరు జిల్లాలలో మోటార్‌బైక్‌లు దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 35 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు.

10/08/2018 - 23:06

* హత్య కేసులో వీడిన చిక్కుముడి!
* కాళ్లు, చేతులు తీయమని సుపారి
* హంతకులను ఏర్పాటు చేసిన బేల్దారి మేస్ర్తీ
* త్వరలో మీడియా ముందుకు నిందితులు

10/08/2018 - 23:04

రాజమహేంద్రవరం, అక్టోబర్ 8: వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక ఆవ రోడ్డులోని ఆదిత్య ఇన్ లాడ్జి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు.

10/08/2018 - 23:02

కాట్రేనికోన, అక్టోబర్ 8: ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆమె అంగీకరించకపోవడంతో చేయి నరికిన సంఘటన కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలో పల్లం గ్రామానికి చెందిన డొక్కాడ మహాలక్ష్మి (40) చేయికి తీవ్ర గాయం కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహలక్ష్మికి బావ వరసైన పోర గ్రామానికి చెందిన మాతయ్య సోమవారం సాయంత్రం ఆమెపై అత్యాచారం చేయకపోగా ఆమె తిరస్కరించింది.

10/08/2018 - 22:46

కర్లపాలెం, అక్టోబర్ 8: అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన టపాసుల స్థావరంపై ఎస్‌ఐ హజరత్తయ్య స్పెషల్ బ్రాంచ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

10/08/2018 - 22:45

చేబ్రోలు, అక్టోబర్ 8: మండల పరిధిలోని కొమ్మమూరు ఛానల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... చుండూరుకు చెందిన హరి అనే డ్రైవర్‌కు చెందిన ఆటోలో వస్తుండగా మంచాల దాటగానే కొమ్మమూరు ఛానల్ సమీపంలో చేబ్రోలు వైపు నుంచి మంచాల గ్రామానికి వస్తున్న బైకును ఆటో ఢీకొంది.

10/08/2018 - 22:44

గుంటూరు (అరండల్‌పేట) అక్టోబర్ 8: అతడు చిన్నతనం నుంచి చెడు అలవాట్లతో సహవాసం చేశాడు.. దురలవాట్లు, జల్సాలతో జీవితాన్ని అనుభవించవచ్చని భావించి తన జల్సాలు తీర్చుకోవడానికి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇల్లు కనపడితే చాలు అంతా దోచేసి జాగ్రత్తగా సర్దుకుంటాడు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్టై జైలు జీవితం కూడా అనుభవించి వచ్చాడు.

10/08/2018 - 22:40

తిరుపతి, అక్టోబర్ 8: ఎర్రచందనం అక్రమరవాణాలో టాస్క్ఫోర్స్ సిబ్బంది కంటపడకుండా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అనే్వషిస్తున్నా టాస్క్ఫోర్స్ మాత్రం వారిని వదిలిపెట్టడంలేదు. ఎప్పటికప్పుడు తాము కూడా స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి ఆట కట్టిస్తున్నారు.

10/08/2018 - 22:39

రేణిగుంట, అక్టోబర్ 8: స్థానిక రామకృష్ణ కూడలి సబ్‌స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వేణుగోపాలపురంకు చెందిన మురళి కుమారుడు జ్యోతి (19) ద్విచక్ర వాహనంపై మితిమీరిన వేగంతో రామకృష్ణాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వెళుతుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇనుప కమీపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది.

Pages